స్టైలిష్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా !

స్టైలిష్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా !

అదిరిపోయే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, అమ్మాయిల‌ను ఆక‌ట్టుకునే అందం, అణుకు‌వ‌గానే ఉండే అభిన‌యం. ఇన్ని ఫ్ల‌స్ పాయింట్స్ ఉన్నా కానీ అక్కినేని అఖిల్‌కి ఇప్ప‌టిక‌వ‌ర‌కు సాలిడ్ హిట్ ప‌డ‌లేదు.

Ram Naramaneni

|

Aug 12, 2020 | 2:22 PM

Akhil Akkineni Next Movie : అదిరిపోయే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, అమ్మాయిల‌ను ఆక‌ట్టుకునే అందం, అణుకు‌వ‌గానే ఉండే అభిన‌యం. ఇన్ని ఫ్ల‌స్ పాయింట్స్ ఉన్నా కానీ అక్కినేని అఖిల్‌కి ఇప్ప‌టిక‌వ‌ర‌కు సాలిడ్ హిట్ ప‌డ‌లేదు. ఈ హీరో చేసిన ‘అఖిల్’, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ సినిమాలు దారుణ ప‌రాజ‌యాలు కాగా, హ‌లో ఓ మాదిరిగా ఆడింది. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్నాడు అఖిల్. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్‌లో వ‌స్తోన్న ఈ సినిమాలో అఖిల్ సరసన టాప్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో అయినా మంచి విజ‌యం న‌మోదు చేసుకోవాల‌ని చూస్తున్నాడు అఖిల్. మూవీపై కూడా మంచి పాజిటివ్ బ‌జ్ ఉంది. ఇటీవ‌ల అవుట్‌పుట్ చూసిన నాగ్ కూడా సినిమా విజ‌యంపై ధీమాగా ఉన్నార‌ని తెలుస్తోంది.

ఈ సినిమా వేస‌విలో రిలీజ్ అవ్వాలి. అయితే కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. ఇక ఈ ఫిల్మ్ అనంత‌రం ఈ అక్కినేని హీరో తమిళ డైరెక్ట‌ర్‌ మిత్ర‌న్‌తో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద‌గా అప్‌డేట్స్ రాలేదు. ఇక తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ నుంచి అందుతోన్న సమాచారం మేరకు అఖిల్, సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు తెలుస్తోంది. అఖిల్ కోసం సురేందర్ రెడ్డి.. ఓ అదిరిపోచే క‌థ‌ను రెడీ చేశాడట. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu