సంజూ భాయ్‌ త్వరగా కోలుకో…

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పితో చేరిన ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి రిలీజ్...

  • Sanjay Kasula
  • Publish Date - 3:05 pm, Wed, 12 August 20
సంజూ భాయ్‌ త్వరగా కోలుకో...

బాలీవుడ్‌ వరుస కుదుపులకు గురవుతోంది. సుశాంత్ మ‌ృతి తర్వాత కరోనా ఎఫెక్ట్ బాలీవుడ్ ను ఇబ్బందులు పెడుతోంది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ బాలీవుడ్ సినీ ప్రేమికులను ఆందోళనకు గురి చేసింది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పితో చేరిన ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి రిలీజ్ అయ్యారు. ఆస్పత్రిలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత అంతా బాగుందని అనుకునేంతలో మరో పిడుగులాంటి వార్త అందరిని వణికించింది. సంజూ భాయ్‌కు క్యాన్సర్ అని.. అది కూడా ప్రమాద కరమైన లంగ్ క్యాన్సర్ ముంబై ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. సంజయ్ దత్ కి స్టేజ్-4 ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న విషయం నిన్న చేసిన టెస్ట్ లలో బయటపడింది.

క్యాన్సర్ కు చికిత్స చేయించుకోవడానికి అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆయన అమెరికా వెళ్లారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా సంజయ్‌ దత్‌ క్యాన్సర్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

సంజయ్‌దత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆయనతో పాటు నటించిన ఊర్మిళ, రితేష్‌దేశ్‌ ముఖ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. హీరోయిన్‌ ఊర్మిళ.. సంజూ భాయ్‌తో 1997లో కలిసి నటించిన దౌడ్‌ చిత్రంలోని ఒక ఫోటోను షేర్‌ చేశారు.  ప్రస్తుతం సంజయ్‌దత్‌ అలియా భట్‌ నటిస్తున్న సడక్‌ 2లో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు.

నిమ్స్‌లో కరోనా ట్రైయల్స్‌ వేగవంతం