ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!

జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఈ నెల 15వ తేదీన చేపట్టాలనుకున్న..

ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!
Follow us

|

Updated on: Aug 12, 2020 | 6:10 PM

AP Land Distribution To Poor People: జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఈ నెల 15వ తేదీన చేపట్టాలనుకున్న ఇళ్లపట్టాల పంపిణీని ప్రభుత్వం వాయిదా వేసింది. దీనితో అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూములను సిద్దం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఇళ్లపట్టాల కార్యక్రమం ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.

వాస్తవానికి మార్చి 15న ఇళ్ల పట్టాల పంపిణీ చేయాల్సిన ఉండగా.. ఆ తర్వాత ఉగాదికి వాయిదా పడింది. ఇక జూన్ నెలలో ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారు. కానీ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా అది కాస్తా సాధ్యపడలేదు. ఇక జూలై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నా.. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అది ఆగష్టు 15న వాయిదా పడింది. ఇక ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరోసారి ప్రభుత్వం వాయిదా వేసింది.

Also Read: ”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలికి వచ్చిన పార్టీ”..!