AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం.. అలా బిహేవ్ చేయకండి అంటూ చురకలు..

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విజయ్ సేతుపతి విచారణకు హజరు కావాలని ఆదేశించింది. "మీరు స్టార్ హీరో అయినందున మీకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనే వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రవర్తన పై సుప్రీంకోర్టు అసహనం.. అలా బిహేవ్ చేయకండి అంటూ చురకలు..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Feb 12, 2023 | 3:43 PM

Share

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రవర్తనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సెలబ్రెటీ అయిన మీరు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అలా బిహేవ్ చేయకూడదని సూచించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండేళ్ల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో సేతుపతి పై ఓ వ్యక్తి దాడి చేయగా.. అతడిని గమనించిన టీమ్ అడ్డుకున్నారు. అనంతరం విజయ్ సేతుపతి టీమ్ తనపై దాడి చేశారని మహాగాంధీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విజయ్ సేతుపతి విచారణకు హజరు కావాలని ఆదేశించింది. “మీరు స్టార్ హీరో అయినందున మీకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనే వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి.

ఈ విషయాన్ని గ్రహించి ప్రజలపై శ్రద్ధ, గౌరవంతో ముందుకు సాగాలి.మీ అభిమానులు మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తుంటారు. మీ ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ మీరు వారి చుట్టూ తిరగలేరు ” అంటూ చురకలంటించింది.

నటీనటులు ఎక్కువగా అభిమానుల మధ్య ఉంటారని అలాంటి సమయంలో వారి ప్రవర్తన చాలా ముఖ్యం. పబ్లిక్ లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారి గమనించి.. వారి పట్ల గౌరవంగా ఉండాలని స్పష్టం చేసింది. సమతులత్య.. సమగ్రతను సినీ ప్రముఖులు కాపాడుకోవాలని సూచించింది. ఈ కేసు తదపరి విచారణ మార్చి 2కి వాయిదా పడింది. అయితే విజయ్ తరపు న్యాయవాది మాత్రం నా క్లైంట్ ను ఈ కేసు నుంచి తొలగించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.