AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB29: మహేష్ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. మూవీ టైటిల్ ఇదే అంటూ టాక్

'గుంటూరు కారం' సినిమాతో మహేష్ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో  మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

SSMB29: మహేష్ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. మూవీ టైటిల్ ఇదే అంటూ టాక్
Ssmb29
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 6:30 PM

Share

మహేష్ బాబు పుట్టినరోజుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు కొత్త సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘గుంటూరు కారం’ సినిమాతో మహేష్ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో  మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

రాజమౌళి ప్రతి సినిమాకి చాలా సమయం కేటాయిస్తుంటారు. మహేష్ బాబుతో సినిమా విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ రాదు అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘గోల్డ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇదికూడా చదవండి :  Prabhas : సైనికుడిగా రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సీన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనట..

టైటిల్‌పై చిత్ర బృందం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయినా కూడా ‘గోల్డ్’ అనే టైటిల్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే విజయంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియన్ జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కారడవుల్లో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ అడవుల్లో మహేష్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట.  అందుకే ఈ సినిమాకు గోల్డ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబుకి 29వ సినిమా. టైటిల్ వెల్లడించే వరకు ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘SSMB 29’ అని పేరు పెట్టారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గెటప్ పూర్తిగా మార్చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ స్క్రిప్ట్‌ రాశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై అభిమానుల్లో విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..