Sarkaru Vaari Paata: అనుకున్న సమయానికి బాబు ల్యాండ్ అయ్యేనా..? ‘సర్కారు వారి పాట’ వాయిదా పడనుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సర్కారువారి పాట అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

Sarkaru Vaari Paata: అనుకున్న సమయానికి బాబు ల్యాండ్ అయ్యేనా..? 'సర్కారు వారి పాట' వాయిదా పడనుందా..?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2021 | 9:11 AM

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సర్కారువారి పాట అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. మొన్నామధ్య విడుదల చేసిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని మొదటి నుంచి టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.

అయితే ఏమైందో ఏమో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఏకంగా సినిమాను సమ్మర్ కు వాయిదా వేయడంతో అభిమానులు కాస్త నిరాశపడ్డారు. కానీ ఖచ్చితంగా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.  అయితే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండటంతో థియేటర్స్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతోనే సినిమాను వాయిదా వేశారని అంటున్నారు కొందరు. ఏప్రిల్ 1వ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం.. మహేష్ ఇటీవలే మోకాలు సర్జరీ చేయించుకున్నారని తెలుస్తుంది. సర్జరీ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోనున్నారు మహేష్.. అయితే సర్కారు వారిపాట సినిమా షూటింగ్ కాస్త మిగిలిఉండటంతో అనుకున్న తేదీకి ఈ సినిమారాకపోవచ్చు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వైపు ఏప్రిల్ 1 అంటే చాలా సమయం ఉంది కాబట్టి మహేష్ అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు విశ్లేషకులు. మరి మహేష్ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి