Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు సూపర్ స్టార్ నివాళి.. సీతారామ శాస్త్రి పార్ధివదేహాన్ని సందర్శించిన మహేష్ బాబు
సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సిరివెన్నెల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు అనారోగ్యం తో చికిత్స పొందుతున్న సీతారామ శాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు సిరివెన్నెల ఆరోగ్యాన్ని పరీశిలిస్తూ వచ్చారు. కానీ చివరకు ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 31న తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీప్రముఖులు సందర్శనాంర్ధం ఫిలింఛాంబర్ కు తరలించారు.
ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాని, రానా, మురళీమోహన్ సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించున్నారు. ఆయన భౌతికకాయానికి మహేష్ నివాళ్లు అర్పించారు. మహేష్ నటించిన చాలా సినిమాలకు సిరివెన్నెల పాటలు రాసారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సిరివెన్నెల కుటుంబసభ్యులను పరామర్శించారు మహేష్.
మరిన్ని ఇక్కడ చదవండి :