Superstar Kirshna: నిర్మాత బీఏ రాజు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సూపర్ స్టార్ క్రిష్ణ.. ఎమోషనల్ కామెంట్స్..
తన ప్రియ అభిమాని బి ఏ రాజు గురించి సూపర్ స్టార్ కృష్ణ గారు తన జ్ఞాపకాలు పంచుకున్నారు...
ప్రముఖ దివంగత నిర్మాత.. పాపులర్ జర్నలిస్ట్ బీఏ రాజు మొదటి వర్దంతి (మే 21) సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ఆయనను గుర్తుచేసుకున్నారు.. ఎన్నో చిత్రాలకు పీఆర్ఓ గా పనిచేసి.. సూపర్ హిట్ ఫ్రెండ్స్ బ్యానర్లపై బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు బీఏ రాజు. ఆయన దాదాపు 1600 చిత్రాలకు పైగా పి ఆర్ ఓ గా పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ఆర్ జె సినిమాస్, సూపర్ హిట్ ఫ్రెండ్స్ నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసి ఆ బ్యానర్లపై సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారాడు. గతేడాది మే 21న బీఏ రాజు ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిగా పరిశ్రమ లోకి అడుగుపెట్టిన బి ఏ రాజు గారు అంచలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమ లో ఆయన తెలియని వారు లేనంతగా అనుబంధాన్ని పెంచుకున్నారు. తన ప్రియ అభిమాని బి ఏ రాజు గురించి కృష్ణ గారు తన జ్ఞాపకాలు పంచుకున్నారు…
“బి ఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ 1 పత్రికగా తీర్చిదిద్దాడు. సూపర్ హిట్ పత్రిక ఎంత ఫేమస్ అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు, చికాగో లో ఇండియన్ స్ట్రీట్ లో అన్నీ ఇండియన్ షాపులు ఉండేవి. అందులో పేపర్లు అమ్మే తెలుగు షాపు ఒకటి ఉంది. అందులో ఆదివారం ఎడిషన్ ఈనాడు, సూపర్ హిట్ ఈ రెండే తెలుగు పేపర్లు ఉన్నాయి. అమెరికా లో కూడా పాపులర్ అయ్యేంతగా డెవలప్ చేశాడు సూపర్ హిట్ ని. తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం.” అన్నారు కృష్ణ గారు.
Superstar Krishna Garu Remembering BA Raju Garu On His First Death Anniversary #Krishna Garu #BaRaju Garu #RememberingBaRaju pic.twitter.com/nNR7x8GUR0
— BA Raju’s Team (@baraju_SuperHit) May 20, 2022
మరిన్ని సినిమా వార్తలు చదవండి..