Manjula Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్దంతి.. మంజుల ఎమోషనల్ పోస్ట్..
దాదాపు 350 పైగా సినిమాలు చేశారు కృష్ణ. ఈరోజు కృష్ణ తొలి వర్దంతి. గతేడాది నవంబర్ 15న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ఘట్టమనేని కుటుంబసభ్యులకు.. అభిమానులకు తీరని లోటును మిగిల్చింది. ముఖ్యంగా గతేడాది ఘట్టమనేని కుటుంబసభ్యులకు.. అభిమానులకు పెద్ద విషాదాన్ని మిగిల్చింది. ఒకే సంవత్సరంలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవీ, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇలా అందరూ స్వర్గస్తులయ్యారు. ఈరోజు కృష్ణ ప్రథమ వర్ధంతి కావడంతో ఆయనను గుర్తుచేసుకుంటున్నారు.

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సంచనాలు..మరెన్నో ప్రయోగాలు.. అంతకు మించిన అద్భుతాలు, సాహసాలు చేసిన హీరో సూపర్ స్టా్ర్ కృష్ణ. తెలుగు తెరపై ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి టెక్నాలజీని పరిచయం చేశారు కృష్ణ. దాదాపు 350 పైగా సినిమాలు చేశారు కృష్ణ. ఈరోజు కృష్ణ తొలి వర్దంతి. గతేడాది నవంబర్ 15న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ఘట్టమనేని కుటుంబసభ్యులకు.. అభిమానులకు తీరని లోటును మిగిల్చింది. ముఖ్యంగా గతేడాది ఘట్టమనేని కుటుంబసభ్యులకు.. అభిమానులకు పెద్ద విషాదాన్ని మిగిల్చింది. ఒకే సంవత్సరంలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవీ, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇలా అందరూ స్వర్గస్తులయ్యారు. ఈరోజు కృష్ణ ప్రథమ వర్ధంతి కావడంతో ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
“ప్రియమైన నాన్నా. ఏడాది పూర్తైంది మీరు మమ్మల్ని వదిలి వెళ్లి. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము. కానీ ఎల్లప్పుడూ మీ ఉనికిని అనుభవిస్తాను. మేము మీ ఇంట్లోనే ఉంటున్నాం. మీరు షూటింగ్ నుండి అయినా లేదా 100 రోజుల ఫంక్షన్ నుండి అయినా లేదా అవుట్‌డోర్ నుండి అయినా వెంటనే ఇంటికి వచ్చేస్తారు. మీరు నిజ జీవితంలోకి తిరిగి వచ్చేస్తారు. మీ పనిలో నిమగ్నమైన మీలాంటి వారి కోసం, ఏదో ఒకవిధంగా మీరు అందరికీ అందుబాటులో ఉండేవారు. అన్ని బాధ్యతలు నిర్వర్తించేవారు. ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తుండేవారు. మీరు మీ వృత్తిలో ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో అద్భుతాలు చేశారని ఈ ప్రపంచానికి తెలియదు. మీ మనసు ఎప్పుడూ ఇంటి మీద.. ఇంటి సభ్యుల మీదే ఉండేది. లవ్యూ నాన్న.. మీ ప్రేమను ఎప్పటికీ అనుభూతి చెందుతూనే ఉంటాను” అంటూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చారు.
View this post on Instagram
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్. ఆయన నటించిన తొలి చిత్రం తేనెమనసులు. ఇది ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ సోషల్ చిత్రం. అలాగే తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116. తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు. తొలి తెలుగు 70 ఎంఎం సినిమా సింహాసనం. తొలి ఓ.ఆర్.డబ్యూ రంగుల చిత్రం గూడుపుఠాణి ఇలా రికార్డులు కృష్ణ సొంతం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




