Vettaiyan The Hunter: రజినీకాంత్ ‘వెట్టైయాన్’ ట్రైలర్ అదిరిందిగా.. అమితాబ్, రానా మరింత స్పెషల్..
జైలర్ సూపర్ హిట్ తర్వాత రజినీ నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. అలాగే ఈ చిత్రంలో అమితాబ్ కీలకపాత్రలో నటిస్తుండడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడూ చూద్ధామా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘వెట్టైయాన్. ది హంటర్’. జైభీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవలే విడుదలైన ‘మనసియాలో’ సాంగ్ యూట్యూబ్లో సెన్సెషన్ సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులోని స్టెప్స్, రజినీ, మంజు వారియర్ లుక్స్ తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జైలర్ సూపర్ హిట్ తర్వాత రజినీ నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. అలాగే ఈ చిత్రంలో అమితాబ్ కీలకపాత్రలో నటిస్తుండడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడూ చూద్ధామా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
కాసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ ఆద్యంత ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో రజినీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషిస్తున్నారు. వీరి ముగ్గురి మధ్య రాబోయే సీన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ, పోరంబోకులకు బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలను ఎన్‌కౌంటర్‌లో చంపేయాలి` అని ట్రైలర్‌లో వినిపించే డైలాగులతో అక్కడ జరిగిన విషయమేంటో సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. `నేరస్తుడిని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి.. ఇట్ వాజ్ ఎ బ్రూటల్ మర్డర్ సార్.. ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏదీ ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్.. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్లిపోండయ్యా..`.. ఈ డైలాగులన్నీపోలీస్ డిపార్టుమెంట్‌లో రకరకాల సందర్భాలను కళ్లకు కడతాయి.
ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ ముఖ్య పాత్రలలో నటించారు. తాజాగా విడుదలైన వెట్టైయాన్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది.
‘వెట్టైయాన్’ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.