Mahesh Babu’s Daughter Sitara: అన్నతో కలిసి క్రిస్మస్ ట్రీ వద్ద సందడి చేస్తున్న మహేష్ బాబు ముద్దుల తనయ సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితారకి కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. తండ్రి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ వద్దకు వెళ్లి..అక్కడ చేసిన సందడితో..
Mahesh Babu’s Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితారకి కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. తండ్రి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ వద్దకు వెళ్లి.. అక్కడ చేసిన సందడితో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. రోజు రోజుకీ కొత్త ఫొటోస్ తో డ్యాన్స్ లతో ఆకట్టుకుంటూ… తండ్రికి తగ్గ తనయగా పేరు తెచుకుందీ చిన్నారి సితార. మహేష్ బాబు సినిమా షూటింగ్స్ కు ఏమాత్రం విరామం దొరికినా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ ఫోటోలను భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సితార కూడా ఓ చిన్న సెలబ్రెటీగా మారిపోయింది. తాజాగా సితార కొత్త ఫోటో తో ఫ్యాన్స్‌ను మాయ చేస్తోంది. తన అన్న గౌతమ్ కృష్ణ తో క్రిస్మస్ ట్రీ వద్ద సందడి చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
మహేష్ బాబు తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఏఅండ్‌ఎస్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఛానెల్‌లో అనేక ఆసక్తికర అంశాలని వివరించడంతో పాటు అడపాదడపా సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తుంటారు.
Also Read: ట్రక్కుని ఢీ కొట్టిన సానియా భర్త షోయబ్ మాలిక్ కారు… అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా..!