Actress RenuDesai: ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..
సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి రేణు దేశాయ్‌కు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ
సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి రేణు దేశాయ్‌కు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్ని పుకార్లు మాత్రమేనని రేణు దేశాయ్ ఇటీవల ఖంచించింది. ఇక గత కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందులో మహేశ్‌కు వదినగా ఆమె నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల లైవ్ చాట్‌లో పాల్గొన్న రేణు దేశాయ్.. ఆ రూమర్స్ పై స్పందించింది. తాను సర్కారు వారి పాట సినిమాలో నటించడం లేదని స్పషం చేశారు.
“ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు కూడా నేను మేజర్ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మహేష్‌కు వదినగా నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నేను నటిస్తే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాను” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇప్పటీకే రేణు దేశాయ్ ఓ తెలుగు సినిమా పూర్తిచేసినట్లుగా చెప్పారు. అంతేకాకుండా మరో రెండు సినిమాల కథలు విన్నానని, వాటిని ఫైనలైజ్ చేయాల్సి ఉందని తెలిపింది.
View this post on Instagram
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ జీవితంలో ముందుకు సాగాలి.. నెటిజన్ ప్రశ్నకు రేణు సమాధానం