Sundeep Kishan: ‘మీరు రియల్ హీరో సార్’.. పేదమహిళకు అండగా సందీప్ కిషన్.. ఆస్పత్రి ఖర్చుల కోసం ఏకంగా..
సినిమాల సంగతి పక్కన పెడితే సందీప్ కిషన్ కు సామాజిక స్పృహ ఎక్కువ. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగా తాను నిర్వహిస్తోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు సందీప్ కిషన్.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలో హీరోగా మెప్పిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇటీవల ధనుష్ తో కలిసి అతను నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో సందీప్ కిషన్ నటనకు ప్రశంసలు వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే సందీప్ కిషన్ కు సామాజిక స్పృహ ఎక్కువ. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగా తాను నిర్వహిస్తోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు సందీప్ కిషన్. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు తన రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నాడీ హ్యాండ్స్ హీరో. ఇందుకు గానూ నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ ఇటీవలే చెప్పుకొచ్చాడు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సందీప్ కిషన్.
యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు సాయం చేశాడు హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ మేరకుస్పందించిన అతను వెంటనే డబ్బును సదరు మహిళ కు అందజేశాడు. ‘యాక్సిడెంట్ కారణంగా మహిళ మెదడులో బ్లీడింగ్ అవుతుందని, రోజుకు దాదాపు రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, మీ సాయం కావాలి’ అని కోరుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. దీంతో చెలించిపోయిన సందీప్ కిషన్ వెంటనే సదరు మహిళకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేశాడు.
సందీప్ కిషన్ పోస్ట్ ఇదిగో..
Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt
— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024
అంతేకాదు తాను సాయం చేశానని, మీరు కూడా ఎంతో కొంత చేయాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సందీప్ కిషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రాయన్ సినిమాలో సందీప్ కిషన్..
When #WaterPacket hits so hard! 👀🔥#RaayanMegaBlockbuster in cinemas near you!@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan #GeminiTV #Dhanush #SundeepKishan #Kalidas #PrakashRaj #SJSuryah #DusharaVijayan pic.twitter.com/ZVq7EXs3W8
— Gemini TV (@GeminiTV) August 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.