Sukumar : పని చేసే అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం.. సుకుమార్ సతీమణి సంబరం

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తబిత తమ ఫ్యామిలీ ఫొటోలతో పాటు భర్త సుకుమార్ సినిమాలకు సంబందించిన అప్డేట్స్ ను నెట్టింట అభిమానులతో పంచుకుంటూ ఉంటారు తబిత.

Sukumar : పని చేసే అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం.. సుకుమార్ సతీమణి సంబరం
Sukumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2024 | 10:18 AM

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సుకుమార్ భార్య తబిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పుష్ప సినిమా గురించి క్రేజీ న్యూస్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే సెట్స్ నుంచి చిన్న చిన్న లీక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తబిత తమ ఫ్యామిలీ ఫొటోలతో పాటు భర్త సుకుమార్ సినిమాలకు సంబందించిన అప్డేట్స్ ను నెట్టింట అభిమానులతో పంచుకుంటూ ఉంటారు తబిత. తాజాగా తబిత చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె చేసిన పనికి నెట్టింట అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

తమ ఇంట్లో పని చేస్తున్న అమ్మాయికి తబిత సాయం చేశారని తెలుస్తోంది. తన ఇంట్లో హెల్పర్ గా పని చేస్తున్న ఓ అమ్మాయి చదువుకు తబిత సాయం అందించారు. ఆమె బాగా చదివి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. ఈ విషయాన్నీ తెలుపుతూ తబిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈమేరకు ఆమె ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మాకు సాయం చేసేందుకు వచ్చిన అమ్మాయి ఈ రోజు కష్ట మైన పరిస్థితులను దాటుకుని విజయాన్ని సాధించింది..  తన చదువు పూర్తి చేసుకోని  ప్రభుత్వ ఉద్యోగానికి సెలక్ట్ అయినందుకు  మాకు ఎంతో ఆనందంగా ఉంది” అన్నారు తబిత.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

అలాగే “తన కలల కోసం ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు ఆమెను అభినందిస్తున్నాము. నిన్ను చూసి గర్వపడుతున్నాం” అంటూ తబిత రాసుకొచ్చారు. దాంతో సుకుమార్ భార్యను ప్రశంసిస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.  తబిత షేర్ చేసిన ఫాస్ట్ పై సినీ సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు. తబితను అభినందిస్తూ ఆమె పోస్ట్ ను లైక్ చేస్తున్నారు. కంగ్రాట్స్, గ్రేట్ మేడం అంటూ తబితను పొగిడేస్తున్నారు. హీరోయిన్స్ సంయుక్త మీనన్, మహేష్ బాబు భార్య నమృత సైతం తబిత పోస్ట్ ను లైక్ చేశారు.

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ