భక్తిలో మునిగితేలుతున్న ఈ నటిని గుర్తుపట్టారా.? సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను

తెలుగులో సీరియల్ స్టార్స్ గా రాణిస్తున్నారు కొందరు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న అమ్మడు ఒకరు. ఆమెను కొంతమంది సీరియల్ సాయి పల్లవి అని కూడా పిలుస్తున్నారు. ఆమెకు కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

భక్తిలో మునిగితేలుతున్న ఈ నటిని గుర్తుపట్టారా.? సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
Actress Photos
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2024 | 9:55 AM

సినిమాలతో పాటు సీరియల్స్ కు కూడా మన దగ్గర మంచి క్రేజ్ ఉంది. నిజం చెప్పాలంటే సినిమాలు చూడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు కానీ సీరియల్స్ చూడకుండా ఉండే వారు మాత్రం లేరు అనే చెప్పాలి. సాయంత్రం మొదలు పెడితే రాత్రి 10 గంటలవరకు నాన్ స్టాప్ గా సీరియల్స్ చూసేస్తుంటారు కొందరు లేడీస్.. ఇక సీరియల్ నటులకు కూడా సినిమా వాళ్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇక తెలుగులో సీరియల్ స్టార్స్ గా రాణిస్తున్నారు కొందరు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న అమ్మడు ఒకరు. ఆమెను కొంతమంది సీరియల్ సాయి పల్లవి అని కూడా పిలుస్తున్నారు. ఆమెకు కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? భక్తిలో మునిగి తెలుతోన్న ఆమె నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.?

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

సీరియల్స్ అన్నింటిలో కన్నా బ్రహ్మముడి అనే సీరీయల్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. టీఆర్పీ లోనూ ఈ సీరియల్ దూసుకుపోతోంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పైన కనిపిస్తున్న అమ్మడు కూడా బ్రహ్మముడి సీరియల్ నటే ఆమె పేరు కావ్య అలియాస్ దీపిక రంగరాజు. ఈ చిన్నది బ్రహ్మముడి సీరియల్ లో మెయిన్ లీడ్ గా నటిస్తుంది.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

తమిళ్ ఇండస్ట్రీకి చెందిన దీపిక రంగరాజు. అక్కడ పలు సీరియల్స్ లో నటించింది. అలాగే తెలుగులో బ్రహ్మముడి సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీపికా రంగరాజు తమిళ్ లో చితిరం పేసుతాడి అనే సీరియల్ లో ఐపీఎస్ అధికారిగా మెప్పించింది. ఆ సీరియల్ తో తమిళ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీపిక ఆరాడి అనే ఒక మూవీ కూడా చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కావ్య తాజాగా ఇలా భక్తిలో మునిగి తేలుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..