Pushpa 2: ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది.. పుష్ప 2 గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న సినిమా థియేటర్లలోకి రానుంది. విడుదలకు నెల రోజులే ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2 బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని టాక్. మొదటి భాగం కంటే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని సిద్ధం చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ గా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేశారు. మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తిచేయనున్నారు. కాగా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న సినిమా థియేటర్లలోకి రానుంది. విడుదలకు నెల రోజులే ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2 బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని టాక్. మొదటి భాగం కంటే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని సిద్ధం చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. అలాగే విలన్ గా ఫహద్ ఫాజిల్ సహా పలువురు తారలు కనిపించనున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్‌లో మాస్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఇటీవల డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలిపారు.
ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
ఇదిలా ఉంటే అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అల్లు అర్జున్‌కి కేరళలో ఫ్యాన్ బేస్ బాగానే ఉంది కాబట్టి అక్కడ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ జిస్ జాయ్ మలయాళ వెర్షన్‌కి డబ్బింగ్ చెబుతున్నారు. మలయాళ వెర్షన్ ‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్‌ను 4 రోజుల్లో పూర్తి చేశానని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?
ఈ సమయంలో, అతను సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంటూ, సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నాడు. మరికొద్ది రోజుల్లో రెండో భాగం డబ్బింగ్‌ను ప్రారంభిస్తానని చెప్పారు. అల్లు అర్జున్ అద్భుతమైన నటనను ఈ చిత్రంలో చూడబోతున్నారు, అభిమానులు దీనిని చూసి ఆనందిస్తారు. ఆ అదే విధంగా తొలి భాగం కంటే పుష్ప 2లో మాస్ సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పారు. ఈ సీక్వెల్‌లో ఫహద్ ఫాజిల్ కూడా తన నటనతో అలరించబోతున్నాడు. మంచి స్క్రీన్‌ప్లే, పాటలు, సినిమాటోగ్రఫీ, సుకుమార్ డైరెక్షన్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని అతను చెప్పుకొచ్చాడు. దాంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.