AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasanna Vadanam Review: ప్రసన్న వదనం మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్ కొట్టినట్టేనా..

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా ప్రసన్న వదనం సినిమాతో వచ్చాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Prasanna Vadanam Review: ప్రసన్న వదనం మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్ కొట్టినట్టేనా..
Prasannavadanam
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 03, 2024 | 4:12 PM

Share

మూవీ రివ్యూ: ప్రసన్నవదనం

నటీనటులు:  సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష తదితరులు

సినిమాటోగ్రాఫర్: ఎస్ చంద్రశేఖరన్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

సంగీతం: విజయ్ బుల్గానిన్

నిర్మాతలు: మణికంఠ, ప్రసాద్ రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అర్జున్ వైకె

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా ప్రసన్న వదనం సినిమాతో వచ్చాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేసే సూర్య (సుహాస్) ఒక యాక్సిడెంట్ లో అమ్మానాన్నలను పోగొట్టుకుంటాడు. అదే ప్రమాదంలో ఆయనకు ఫేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన సమస్య వస్తుంది. దీనివల్ల మొహాలను గుర్తుపట్టలేక పోతాడు సూర్య. అదే సమయంలో ఆయన జీవితంలోకి ఆధ్యా (పాయల్ రాధాకృష్ణ) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సూర్య. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక మర్డర్ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. మొహాలను గుర్తుపట్టలేడు కాబట్టి అతడిని కొంతమంది ఆ కేసులో ఇరికించాలని చూస్తారు. ఈ మర్డర్ కేసులో నుంచి బయటపడడానికి ఏసీబీ వైదేహి (రాశి సింగ్) సూర్యకు ఎలాంటి సాయం చేసింది.. అందులోంచి సూర్య ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ..

కథనం:

కొన్నిసార్లు సినిమా కంటే అందులో ఉన్న ఒక పాయింట్ మనల్ని బాగా ఎగ్జైట్ చేస్తుంది. అలా ఎగ్జైట్ చేసిన సినిమా ప్రసన్న వదనం. ప్రతి సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు సుహాస్. ప్రసన్న వదనం లో కూడా ఇదే చేశాడు. సుహాస్ ఉన్నాడు కాబట్టి డిసప్పాయింట్ చేయడనే నమ్మకంతో వచ్చిన ప్రేక్షకులకు ఆయన బాగానే న్యాయం చేశాడు. ముందుగా చెప్పినట్టు పాయింట్ ఎగ్జైట్ చేసింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. సొంత మొహం కూడా గుర్తు పట్టలేని ఒకడు.. మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. డైరెక్టర్ అర్జున్.. సుకుమార్ శిష్యుడు కాబట్టి చాలా వరకు లాజికల్ గా కథ రాసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. కథ ముందుకు వెళుతున్న కొద్దీ ఎక్కడికక్కడ ట్విస్టులు బయటపడుతూ ఉంటాయి. ఫేస్ బ్లైండ్ నెస్ తో హీరో పడే ఇబ్బందులు.. తొలి అరగంట ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు దర్శకుడు. కానీ దాని వల్లే సమస్యలో ఇరుక్కుంటే ఏమవుతుంది అనేది తర్వాత చూపించాడు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే రొటీన్ కథ ఇది. కానీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పాడు దర్శకుడు. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో సినిమా కూడా మెప్పిస్తుంది. మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్.. క్లైమాక్స్ బాగున్నాయి. ఈ కాన్సెప్ట్ ఇంకా చాలా బాగా తీయచ్చేమో అనిపించింది.

నటీనటులు:

సుహాస్ నటన గురించి చెప్పడానికి ఏం లేదు.. మరోసారి అదరగొట్టాడు. హీరో ఫ్రెండ్ గా వైవా హర్ష ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఓకే. మరో హీరోయిన్ రాశి సింగ్ పెద్ద సర్ప్రైజ్. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్:

ప్రసన్న వదనం సినిమాకు మెయిన్ అడ్వాంటేజ్ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్. ఆయన అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్ చంద్రశేఖరన్ వర్క్ అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా ఓకే. దర్శకుడు అర్జున్ మంచి పాయింట్ తీసుకున్నాడు.. ఆకట్టుకునేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అర్హ మీడియా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ప్రసన్న వదనం.. సూపర్ కాన్సెప్ట్.. ఓసారి చూడొచ్చు..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..