Puneeth Rajkumar: ఈ పాపం కొవి షీల్డ్‌దేనా.. అప్పుడే పునీత్‌ను హెచ్చరించిన అభిమాని
వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయని వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలిపింది. దాంతో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతూ వచ్చాయి.

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌కు ఓషదం అంటూ కొవి షీల్డ్ అందుబాటులోకి వచ్చింది. ఈ వాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ ఇటీవలే అంగీకరించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయని వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా తెలిపింది. దాంతో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతూ వచ్చాయి. కొవి షీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కు సంబందించిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది .
పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29, 2021న మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ చాలా ఫిట్ గా ఉంటారు. నిత్యం వర్కౌట్స్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉండే పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా గుండె పోటుకు గురై కన్నుమూశారు. ఇప్పుడు కొవి షీల్డ్ తీసుకోవడం వల్లనే పునీత్‌కు గుండెపోటు వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. దీని పై పునీత్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ ఏప్రిల్ 7, 2021న తాను వ్యాక్సిన్ తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారైతే టీకాలు వేయించుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. అయితే బృందావన అనే అకౌంట్ నుంచి ఓ అభిమాని పునీత్ పోస్ట్ కు కామెంట్ చేశాడు. ‘కొవి షీల్డ్ తీసుకోవద్దు. 45 ఏళ్లు పైబడిన వారికి ఇది మంచిది కాదు.’ అని ఆ అభిమాని రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కొవి షీల్డ్ కారణంగానే పునీత్ గుండెలో రక్తం గడ్డ కట్టిందా.? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆస్ట్రాజెనెకా కొవి షీల్డ్ పేరుతో వ్యాక్సిన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఇండియాలో పెద్ద సంఖ్యలో ఈ వ్యాక్సిన్లు తీసుకున్నారు ప్రజలు. దీంతో దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. కొవి షీల్డ్ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని, ఇది గుండెపోటుకు దారితీస్తుందని అంటున్నారు.
Got my first dose of vaccination today. If you are 45 years & above ensure you get vaccinated. #vaccinated #LargestVaccineDrive pic.twitter.com/QsX9NnkjGS
— Puneeth Rajkumar (@PuneethRajkumar) April 7, 2021
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




