AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బుకోసమే ఇదంతా.. పెళ్లే కాలేదు అప్పుడే విడాకులు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శుభ శ్రీ

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. సీజన్ 7లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గ్లామర్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఇక అమర్ దీప్ తో జరిగిన గొడవతో ఈ అమ్మడు పేరు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ ఆ తర్వాత పలు సినిమాలు, ప్రైవేట్స్ సాంగ్స్ చేసింది.

డబ్బుకోసమే ఇదంతా.. పెళ్లే కాలేదు అప్పుడే విడాకులు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శుభ శ్రీ
Subhashree Rayaguru
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2025 | 4:08 PM

Share

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో శుభ శ్రీ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 7లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గ్లామర్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఇక అమర్ దీప్ తో జరిగిన గొడవతో ఈ అమ్మడు పేరు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ ఆ తర్వాత పలు సినిమాలు, ప్రైవేట్స్ సాంగ్స్ చేసింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న శుభశ్రీ.. ఇటీవలే సినీ నిర్మాత అజయ్ మైసూర్ తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది శుభ శ్రీ. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాలు నిర్మించాడు అజయ్ మైసూర్.

సోషల్ మీడియాలో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పంచుకుంది శుభ శ్రీ. అయితే ఆమె డబ్బు కోసమే అజయ్ మైసూర్ ను పెళ్లి చేసుకుంటుందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయి నల్లగా ఉన్నవాడిని, లావు ఉన్నవాడిని ఎందుకు చేసుకుంటుంది.. డబ్బుకోసమే చేసుకుంటుంది అంటూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో తన పై జరుగుతున్న ట్రోల్స్ పై స్పందించింది శుభ శ్రీ. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నల్లగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయని చేసుకుంటున్నారు అని అంటున్నారు. మీకు ఎంత ధైర్యం.? అసలు మీరెవరు నా లైఫ్‌లో ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి.. డబ్బున్న అబ్బాయిలు నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు అని తెలిపింది శుభ శ్రీ.

ఇవి కూడా చదవండి

నా దగ్గర కూడా డబ్బు ఉంది, కారు, బంగ్లా అన్ని ఉన్నాయి. అయినా దేశంలో చాలా మంది అబ్బాయిలు నల్లగా ఉన్నవారు ఉన్నారు. ఆయన మంచి ఫుడీ. జిమ్‌కి వెళ్తే తగ్గుతారు. కానీ ఆయనకు అలా ఉండటమే ఇష్టం..అయినా నేను అబ్బాయి మంచివాడా.. కాదా రెస్పెక్ట్ ఇస్తున్నాడా అనేదే చూస్తా..ఆయనతో నేను చాలా హ్యాపీగా ఉన్నా.. ఈ 9నెలల్లో నేను ఎప్పుడూ ఏడవలేదు.. మేము లవ్ చేసుకొని పెళ్లీడు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ లో మేము సరదాగా డాన్స్ చేశాం.. దానికి ఆయనకు డాన్స్ రాదు అంటూ ట్రోల్ చేశారు. అలాంటి వాళ్లకు ఏం చెప్పలేము.. పెళ్లి కూడా కాకుండానే డైవర్స్  అంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చూసి నేను చాలా ఏడ్చా.. మా ఫ్యామిలీకి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు అంటూ ఎమోషనల్ అయ్యింది శుభ శ్రీ.

View this post on Instagram

A post shared by Ajay Mysore (@ajay_mysore__)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి