AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె ఓ స్టార్ కిడ్.. స్టార్ హీరో భార్య.. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఇలా..

సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు రెగ్యులర్ గా అభిమానులు షేర్ చేస్తూ ఉంటారు. చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ అందాల భామ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఆమె ఓ స్టార్ కిడ్.. స్టార్ హీరో భార్య.. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఇలా..
Acytress
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2025 | 4:28 PM

Share

సినిమా తరాల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ కిడ్.. అలాగే ఓ స్టార్ హీరో భార్య.. కానీ సక్సెస్ మాత్రం ఆమెకు అందని ద్రాక్ష. వరుసగా సినిమాలు చేసినా కూడా ఆమెకు హిట్ మాత్రం దక్కలేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో తొలి సినిమానే ఓ స్టార్ హీరోతో చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

ఆమె ఎవరో కాదు అందాల భామ సయేషా. క్రేజీ బ్యూటీ సయేషా 2015లో అఖిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. సయేషా అందానికి మంచి మార్కులు పడ్డాయి. అఖిల్ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. హిందీ సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అందాల భామ.

ఇవి కూడా చదవండి

 ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

అక్కడ తక్కువ కాలంలోనే సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలతో సయేషా నటించింది. ఓ తమిళ్ సినిమా షూటింగ్ లో ఆర్య , సయేషా మధ్య ప్రేమ చిగురించింది. 2019లో ఆర్య, సయేషాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆగస్టు 12న ముంబైలో జన్మించింది సయేషా. ఆమె బాలీవుడ్ నటుడు సైరా బాను, దిలీప్ కుమార్‌లకు మనవరాలు. పెళ్లి తర్వాత సయేషా సినిమాలకు దూరంగా ఉంటుందో. ఈ స్టార్ కపుల్ కు ఓ కూతురు కూడా ఉంది.

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు