AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు నా కాలేజ్ ఫ్రెండ్.. ఇప్పుడు నా ఫెవరెట్ హీరో.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండనుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు నా కాలేజ్ ఫ్రెండ్.. ఇప్పుడు నా ఫెవరెట్ హీరో.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
Maheshbabu
Rajeev Rayala
|

Updated on: May 31, 2025 | 6:40 PM

Share

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా. ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అలాగే మహేష్ పాత్ర రామాయణంలోని హనుమంతుడి నుండి స్ఫూర్తి పొందినట్లుగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ మహేష్ బాబు తన క్లాస్ మేట్ అని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచిన సినిమాల్లో అతడు సినిమా ఒకటి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగాఆకట్టుకోలేకపోయింది. కానీ బుల్లి తెరపై ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో త్రిష, మహేష్  మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బావ ప్రేమకోసం ఎదురుచూసే పల్లెటూరి అమ్మాయిగా త్రిష అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి సైనికుడు సినిమా చేశారు. కానీ ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాత త్రిష, మహేష్ బాబు కలిసి నటించలేదు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి త్రిష మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహేష్ బాబు తన ఫెవరెట్ హీరోల్లో ఒకరు అని చెప్పింది. అలాగే మహేష్ బాబు సెట్‌లో చాలా సరదాగా ఉంటాడు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు.

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా గౌరవిస్తాడు. అసలు కారవాన్ లోకి కూడా వెళ్లడు. తన షూటింగ్ అయిపోయినా కూడా మానిటర్ దగ్గర కూర్చొని అన్ని గమనిస్తూ ఉంటాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేము ఇద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాము. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ టైం లో మేము యాక్టర్స్ అవుతామని అనుకోలేదు. అప్పుడు హాయ్, బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మహేష్ నా ఫెవరెట్ హీరోల్లో ఒకడు అని త్రిష చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..