AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొమ్మరిల్లు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? కారణం ఏంటో తెలుసా..

తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా ఒకటి. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో సిద్దార్థ్, జెనీలియా కలిసి నటించారు. ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ మూవీ. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

బొమ్మరిల్లు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? కారణం ఏంటో తెలుసా..
Bommarillu
Rajeev Rayala
|

Updated on: May 31, 2025 | 7:03 PM

Share

తెలుగు సినిమాల్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత జెనీలియా పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో ఆమె పేరు హాసిని. చాలా రోజులు ప్రేక్షకులు జెనీలియాని ఇదే పేరుతో పిలిచారు. అంతే కాదు కుర్రాళ్లు తమ లవర్ కు హాసిని అనే పేరు పెట్టుకున్నారు కూడా.. బొమ్మరిల్లు సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా చూస్తే మంచి ఫీల్ వస్తుంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వనుంది. 2007లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 21మన మరోసారి థియేటర్స్‌లో సందడి చేయండని రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే బొమ్మరిల్లు సినిమాను ముందుగా ఓ స్టార్ హీరో చేయాలిసిందట కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ కథ సిద్దార్థ్ దగ్గరకు వెళ్ళింది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు కథ నాకు బాగా నచ్చింది. నా ఇమేజ్ వల్ల ఓ సినిమా హిట్ అవ్వకపోయిన పర్లేదు.. కానీ నా ఇమేజ్ వల్ల ఆ సినిమాకు రావాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దిల్ రాజు వచ్చి నాకు బొమ్మరిల్లు కథ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యో ఈ సినిమా మిస్ అయిపోతుందే అని బాధపడ్డాను. నాకు బాగా నచ్చిన కథ అది. నా ఇమేజ్ ఆ సినిమాకు న్యాయం చేయదు. అందుకే ఆ సినిమాను వదులుకున్నాను అని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు