AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani-S J Suryah: ‘దయచేసి నన్ను మన్నించండి’.. నానికి క్షమాపణలు చెప్పిన ఎస్‌జే సూర్య.. ఏం జరిగిందంటే?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీలో ఎస్ జే సూర్య విలన్ గా విశ్వ రూపం ప్రదర్శించాడు. అయితే ఓ విషయంలో భాగంగా ఇప్పుడు ఈ క్రేజీ విలన్ హీరో నానికి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు.

Nani-S J Suryah: 'దయచేసి నన్ను మన్నించండి'.. నానికి క్షమాపణలు చెప్పిన ఎస్‌జే సూర్య.. ఏం జరిగిందంటే?
S J Suryah, Nani
Basha Shek
|

Updated on: May 31, 2025 | 6:09 PM

Share

ఒకప్పటి కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ జే సూర్య ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొడుతున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్యన రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు ఎస్ జే సూర్య. అంతకు ముందు న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీలోనూ ప్రతినాయకుడిగా విలనిజం పండించాడు. అవినీతిపరుడైన పోలీస్ అధికారి దయా పాత్రలో అందరినీ భయపెట్టాడు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పడిదే పాత్రకు గాను మరో గొప్ప గుర్తింపు దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు ల్లో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు ఎస్ జే సూర్య. ఇందుకు గానూ హీరో నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా సూర్యకు అభినందనలు తెలియజేశాడు. ‘కంగ్రాట్స్ సర్. మీరు ఈ సినిమాకి కేవలం సహాయ నటుడు మాత్రమే కాదు. మీరు అన్నీ. ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు’ అని సూర్యపై ప్రశంసలు కురిపించాడు నాని. అయితే ఆ సమయంలో సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఎస్ జే సూర్య ‘థ్యాంక్స్ అంటూ కేవలం ఒక్క మాటలో రిప్లై ఇచ్చాడట. ‘చాలా ధన్యవాదాలు నేచురల్ స్టార్ నాని గారు’ అని నాని రిప్లై ఇచ్చాడట. అయితే ఇది సరైన పద్ధతి కాదని గ్రహించిన ఎస్.జె. సూర్య శనివారం నానీకి క్షమాపణలు చెపుతూ ఓ నోట్‌ను రిలీజ్ చేశాడు.

‘మై డియర్  నేచురల్ స్టార్ నాని గారికి.. దయచేసి నన్ను క్షమించండి. షూటింగ్ మధ్యలో ఉండటం వల్ల మీ అభినందనలపై సరిగా స్పందించలేకపోయాను. మీకు కేవలం ‘థాంక్యూ సర్’ అని చెప్పడం సరికాదని నాకు తెలుసు. మీరు, దర్శకుడు వివేక్ గారు మద్దతుగా లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. మీరు తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరో. మీ అభినందనలకు, మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు సూర్య.

ఇవి కూడా చదవండి

ఎస్ జే సూర్య ట్వీట్..

ప్రస్తుతం ఈ నటుడు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఎలాంటి మొహమాటం లేకుండా క్షమాపణలు చెప్పిన సూర్యపై సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Akhil Akkineni: అక్కినేని ఇంట మరో శుభకార్యం.. అఖిల్- జైనాబ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వేదిక ఎక్కడంటే?

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Pavala Shyamala: ‘సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు.. ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’.. దీన స్థితిలో పావలా శ్యామల