SS Thaman: ఏందిది భయ్యా ఇట్లా చేశావ్..! ట్రోలర్స్ దెబ్బకు అది మార్చేసిన తమన్..

ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తుంది. తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు తమన్. అయితే తమన్ పై ఇప్పటికే చాలా కాపీ ట్రోల్స్ వచ్చాయి. తమన్ మ్యూజిక్ అందించిన సినిమాల నుంచి ఏ సాంగ్ వచ్చినా కూడా వెంటనే కాపీ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్స్

SS Thaman: ఏందిది భయ్యా ఇట్లా చేశావ్..! ట్రోలర్స్ దెబ్బకు అది మార్చేసిన తమన్..
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2024 | 10:54 AM

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ తమన్ ఒకరు. 2009లో వచ్చిన కిక్ సినిమాతో ఫెమస్ అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరే వినిపిస్తుంది. తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు తమన్. అయితే తమన్ పై ఇప్పటికే చాలా కాపీ ట్రోల్స్ వచ్చాయి. తమన్ మ్యూజిక్ అందించిన సినిమాల నుంచి ఏ సాంగ్ వచ్చినా కూడా వెంటనే కాపీ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. తాజాగా మరోసారి తమన్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..

తమన్ చాలా సినిమాల్లో హీరోల చేత సాంగ్స్ పాడించాడు. ఈ సారి తన సాంగ్ లో దర్శకుడి వాయిస్ వినిపించాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ ను ఒకొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో దర్శకుడు త్రివిక్రమ్ వాయిస్ వినిపించింది. దాంతో చాలా మంది ట్రోల్ చేశారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ గొంతు సినిమాలో లేదు కానీ తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ లో త్రివిక్రమ్ వాయిస్ వాడారు. ఆయన వాయిస్ సాంగ్ కు సెట్ కాలేదు. గురూజీ బేస్ వాయిస్ ఈ సాంగ్ కు సెట్ కాలేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ట్రోల్స్ చేశారు నెటిజన్స్. తాజాగా ట్రోల్స్ దెబ్బకు ఇప్పుడు గురూజీ వాయిస్ ను తీసేశారు. దాంతో తమన్ అన్న అందుకు ఈ ప్రయోగాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్ లోనూ తమన్ వాయిస్ వినిపించింది.

తమన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

తమన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..