Vishwambhara : విశ్వంభర షూటింగ్‌లో జాయిన్ అయిన స్టార్ హీరోయిన్.. వెల్కమ్ చెప్పిన మెగాస్టార్

కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసార సినిమాను హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించాడు వశిష్ఠ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాను కూడా ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు విశ్వంభర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా  షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

Vishwambhara : విశ్వంభర షూటింగ్‌లో జాయిన్ అయిన స్టార్ హీరోయిన్.. వెల్కమ్ చెప్పిన మెగాస్టార్
Viswambara
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2024 | 12:04 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసార సినిమాను హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించాడు వశిష్ఠ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాను కూడా ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు విశ్వంభర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా  షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు.

విశ్వంభర నుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని తాల్ వినిపిస్తుంది. ఇప్పటికే అనుష్క , హనీ రోజ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తాజాగా ఈ మూవీ సెట్ లోకి అడుగు పెట్టింది అందాలా తార త్రిష. విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.

తాజాగా ఆమె షూటింగ్ కు కూడా హాజరయ్యింది. త్రిషకు మెగాస్టార్ చిరంజీవి వెల్కమ్ చెప్పారు. ఈ మేరకు చిరు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేశారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. అలాగే ఆచార్య సినిమాలోనూ త్రిష హీరోయిన్ గా నటించాలని కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. ఇక ఇప్పుడు విశ్వంభర లో మరోసారి ఈ జోడీ కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు.

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

త్రిష ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..