“ఇక వెయిట్ చెయ్యలేం..షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందే”
కరోనా వచ్చింది. లాక్ డౌన్ తెచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని బంద్ అయ్యాయి. ఈ మధ్యే ప్రభుత్వాలు సడలింపులు ఇస్తుండటంతో..అన్ని వ్యవస్థలు తిరిగి ట్రాక్ పైకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ..సినిమా, సిరియల్స్ షూటింగ్స్ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.

కరోనా వచ్చింది. లాక్ డౌన్ తెచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని బంద్ అయ్యాయి. ఈ మధ్యే ప్రభుత్వాలు సడలింపులు ఇస్తుండటంతో..అన్ని వ్యవస్థలు తిరిగి ట్రాక్ పైకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ..సినిమా, సిరియల్స్ షూటింగ్స్ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత షూటింగ్‌కు వెళ్లడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాని సోషల్ మీడియా వెల్లడించారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా మార్చిలో షూటింగ్ ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో జతచేస్తూ.. ఓ పోస్ట్ చేశారు జక్కన్న. అందులో సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్, విజువల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్లతో జక్కన్న ఏదో డిస్కస్ చేస్తున్నట్లు ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ తెలంగాణ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, అలియా భట్లు కీలకపాత్రలను పోషిస్తున్నారు.

