Mahesh Babu: అందుకే మహేష్ బాబు ఆగడు మూవీ ఫ్లాప్ అయ్యింది.. అసలు విషయం చెప్పిన శ్రీను వైట్ల
మహేష్ బాబుకు ఆయన ఫ్యాన్స్ కు దూకుడు సినిమా చాలా ప్రత్యేకం. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అదే టైం లో దూకుడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. నయా రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది ఈ మూవీ.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ఒకటి. నిజానికి మహేష్ బాబుకు ఆయన ఫ్యాన్స్ కు దూకుడు సినిమా చాలా ప్రత్యేకం. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అదే టైంలో దూకుడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. నయా రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది ఈ మూవీ. అయితే దూకుడు తర్వాత వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలోనే ఆగడు అనే సినిమా చేశారు శ్రీను.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆగడు సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దూకుడులాంటి భారీ విజయం తర్వాత వచ్చిన ఆగడు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం తెలిపారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ దూకుడు తర్వాత మాస్ సినిమా కావాలని అడిగారు. కానీ నాది ఆ స్టైల్ కాదు. ఆగడు సినిమాను సల్మాన్ ఖాన్ టైగర్ జిందహై అనే సినిమా నుంచి ఇన్స్పెర్ అయ్యి తీశాను అని తెలిపారు. అయితే ఆగడు మూవీ తెరకెక్కించిన నిర్మాతలు అప్పటికే ఓ పెద్ద ఫ్లాప్ వచ్చింది. దాంతో వాళ్ళు మహేష్ సినిమాను సింపుల్ గా చేయాలన్నారు. రురల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయమని చెప్పారు. నేను కూడా మహేష్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బయటపెట్టాలని బ్రెత్ లెస్ డైలాగ్స్ కూడా రాశాను.. చాలా కష్టపడ్డాను కూడా.. కానీ ఇవేం వర్కౌట్ కాలేదు. కానీ మహేష్ బాబు దీని పై నన్ను బ్లేమ్ చేయలేదు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా మహేష్ నాతో అలానే ఉన్నారు అని తెలిపారు శ్రీను వైట్ల.
