AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nargis Fakhri: రోజూ అర్ధరాత్రి స్మశానానికి తీసుకెళ్లి అలా చేసేవాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్స్

బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్‌, మైన్ తేరా హీరో, అజహర్ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో రాబోతుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది నర్గీస్ ఫక్రీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తనజీవితంలో జరిగిన ఓ భయంకరమైన సంఘటన గురించి తెలిపింది నర్గీస్ ఫక్రీ.

Nargis Fakhri: రోజూ అర్ధరాత్రి స్మశానానికి తీసుకెళ్లి అలా చేసేవాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్స్
Nargis Fakhri
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2023 | 6:34 PM

Share

బాలీవుడ్ చెక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన రాక్ స్టార్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నర్గీస్ ఫక్రీ. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్‌, మైన్ తేరా హీరో, అజహర్ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో రాబోతుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది నర్గీస్ ఫక్రీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తనజీవితంలో జరిగిన ఓ భయంకరమైన సంఘటన గురించి తెలిపింది నర్గీస్ ఫక్రీ. తనకు ముంబైలో ఉన్న సమయంలో ఓ భయంకరమైన సంఘటన జరిగిందని తెలిపింది.

నేను ముంబైలోని బాంద్రాలో హిల్ రోడ్ లో ఉండేదాన్నని.. నా ఇంటికి దగ్గరలో ఓ శ్మశానవాటిక ఉండేది. ఆ అపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో నాకు భయంకరమైన కలలు వచ్చేవి. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. భయంతో నేను వణికిపోయేదాన్ని రాత్రి మూడు గంటలకే లేచేదాన్ని అని తెలిపింది.

అర్ధరాత్రి సమయంలో ఓ దెయ్యం లాంటి ఓ వ్యక్తి నన్ను బలవంతంగా స్మశానానికి తీసుకెళ్లి.. మనుషుల ఎముకలు తినమని బలవంతం చేసేవాడు. ఇదే కల నాకు వరుసగా మూడు నాలుగు రోజులు వచ్చింది. దాంతో భయంతో వెంటనే ఆ ఇల్లు వదిలేసి ఢిల్లీ వచ్చేశా.. అని చెప్పుకొచ్చింది. అయితే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆరు పక్షి పిల్లలు చనిపోయాయి ఉన్నాయని ప్యాకర్స్ చెప్పడంతో మరింత భయపడ్డా అని తెలిపింది. ఇప్పుడు ముంబైలో మంచిగానే ఉంది అని తెలిపింది.