Khushi Kapoor: శ్రీదేవి సెంటిమెంట్ తో చిన్నకూతురు ఖుషీ కపూర్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్న బోణి కపూర్..

ఎప్పుడెప్పుడా అని అనుకున్న టైమ్ రానే వచ్చింది. ఎదురుచూస్తున్న సమయం కళ్లముందుకొచ్చింది. ఎంట్రీ కన్ఫర్మ్ అయినా.. అదెప్పుడనేదే ఇప్పటివరకు ఆన్సర్ లేని క్వశ్చన్.

Khushi Kapoor: శ్రీదేవి సెంటిమెంట్ తో చిన్నకూతురు ఖుషీ కపూర్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్న బోణి కపూర్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2021 | 1:44 PM

Khushi Kapoor: ఎప్పుడెప్పుడా అని అనుకున్న టైమ్ రానే వచ్చింది. ఎదురుచూస్తున్న సమయం కళ్లముందుకొచ్చింది. ఎంట్రీ కన్ఫర్మ్ అయినా.. అదెప్పుడనేదే ఇప్పటివరకు ఆన్సర్ లేని క్వశ్చన్. ఇదంతా అతిలోక సుందరి శ్రీదేవీ చిన్న కూతురు ఖుషీ కపూర్ కోసమే. ఆమెకు కూడా రెడ్ కార్పెట్ పర్చేశారు. అయితే అది అటు ఇటూ కాకుండా.. మనవైపే వస్తుంది.  అతిలోక సుందరి శ్రీదేవీ తర్వాత ఆమె నటవారసురాళ్లుగా కూతుళ్లు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. మొదట్లో తడబడ్డా.. ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయిపోయింది. కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా మూవీతో తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను చూపించింది. ప్రస్తుతం దోస్తానా పార్ట్ టూ, గుడ్ లక్ జెర్రీ మూవీస్ లో నటిస్తుంది.

ఇక రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా వెండితెరపై అందాల ఆరబోతకు సిద్ధమైంది. ఆమెను కూడా అతి త్వరలోనే సిల్వర్ స్రీన్ పై చూడబోతున్నాం. ఇటీవలే ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో.. నటనలో ఉన్నత విద్యను పూర్తి చేసి ముంబైకి తిరిగి వచ్చారు. ఇటు ప్రముఖ దర్శకనిర్మాత.. కరణ్ జోహార్ కూడా ఖుషీని తన తదుపరి ప్రాజెక్టుకు తీసుకుంటానని తెలిపారు. అయితే తన నిర్మాణ సంస్థ ద్వారా.. సౌత్ అండ్ నార్త్ లో భారీ చిత్రాలు నిర్మిస్తున్న బోణీ కపూర్.. తన చిన్నారి చిత్రరంగ ప్రవేశ బాధత్యలు స్వీకరించారు. ఆమెను బాలీవుడ్ నుంచి కాకుండా.. ఓ తెలుగు మూవీ ద్వారా పరిచయం చేయాలని.. అందుకు సరైన దర్శకుడిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు. శ్రీదేవీ ఎన్ని చిత్రాల్లో నటించినా.. ఆమె తొలి సక్సెస్ తెలుగులోనే కావడంతో.. ఆ సెంటిమెంట్ ను మళ్లీ రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఈ న్యూస్ తో.. ఖుషీతో జోడీ కట్టబోయే హీరో ఎవరనేదానిపై రూమర్లు స్పీడందుకున్నాయి. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకున్నా.. ఆ లక్కీ బోయ్ ఎవరనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇటు తన కూతుళ్లను కూడా తనలాగే వెండితెరపై చూసుకోవాలనుకున్న శ్రీదేవీ కోరికను.. తన కూతుళ్లు నెరవేరుస్తున్నారు. తండ్రి అండతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కపూర్ వారసత్వాన్ని నిలబెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

A. M. Rathnam: “తగ్గేదేలే”…హరిహర వీరమల్లు సినిమాపై క్లియర్‌ కట్‌గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Kartik Aaryan: బాలీవుడ్ లో ఈ యంగ్ హీరోను కూడా కార్నర్ చేస్తున్నారా.. ? కావాలనే తొక్కేస్తున్నారా..?