AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan: బాలీవుడ్ లో ఈ యంగ్ హీరోను కూడా కార్నర్ చేస్తున్నారా.. ? కావాలనే తొక్కేస్తున్నారా..?

బాలీవుడ్లో మరో యంగ్ హీరో.. సుశాంత్‌లా మారబోతున్నారా..? తమ మాట వినలేదని ఆ హీరోకు వస్తున్న వరుస అవకాశాలకు గండి కొడుతున్నారా..?

Kartik Aaryan:  బాలీవుడ్ లో ఈ యంగ్ హీరోను కూడా కార్నర్ చేస్తున్నారా.. ? కావాలనే తొక్కేస్తున్నారా..?
Rajeev Rayala
|

Updated on: May 29, 2021 | 1:18 PM

Share

Kartik Aaryan: బాలీవుడ్లో మరో యంగ్ హీరో.. సుశాంత్‌లా మారబోతున్నారా..? తమ మాట వినలేదని ఆ హీరోకు వస్తున్న వరుస అవకాశాలకు గండి కొడుతున్నారా..? ఇండస్ట్రీలో కార్నర్‌ చేస్తూ.. మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోని తొక్కేస్తున్నారా? బీ టౌన్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా.. కష్టపడి మరీ హీరోగా ఎదిగారు కార్తిక్ ఆర్యన్. తన టాలెంట్‌తో క్రేజీ ఆఫర్లను సంపాదించుకుని బీటౌన్‌ జనాలను అలరించారు, ఇది నిన్నటి మాట. కాని నేడు వచ్చిన సినిమా అవకాశాలు వెనక్కి వెళ్తుంటే చేసేదేం లేక చూస్తూ కూర్చుంటున్నారు.  బీటౌన్‌లో ఓ పెద్దాయన తన మాట వినని కారణంగా ఇప్పటి వరకు కార్తిక్‌…ఒప్పుకున్న సినిమాల్లోని క్యారెక్టర్ను కట్ చేస్తూ.. పొమ్మనలేక పొగపెడుతున్నారు. దీంతో చేసేదేంలేక.. వారితో మరింతగా తగువు పెట్టుకుని ఉన్న కెరీర్‌ని పాడు చేసుకోలేక, క్రియేటివ్ డిఫరెన్సెస్‌ అంటూ.. మీడియాకు చెబుతూ తనని తాను సముదాయించుకుంటున్నారు ఈ యంగ్ హీరో.

ఇప్పటికే కరణ్ జోహార్‌ దోస్తానా2 సినిమా నుంచి బయటి వచ్చిన కార్తీక్ ఆర్యన్… తాజాగా షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్‌ బ్యానర్‌లో చేయాల్సిన మరో సినిమా నుంచి కూడా తప్పుకున్నారు. ఇప్పడు ఇదే విషయం బీటౌన్‌లో వైరల్ గా మారింది. ఇక సుషాంత్ విషయంలో బీటౌన్‌ను ఓ రేంజ్‌లో ఆడిపోసుకున్న కంగనా కూడా ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టి.. సుశాంత్ లా .. కార్తిక్‌ ఆర్యన్ను చేయద్దొందూ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ ఈ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prasanth Varma: మరో సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ సినిమా.. తెలుగులో తొలి ఒరిజినల్ సూపర్ హీరో కథతో మూవీ…

Faria Abdullah: తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న లేడీ జాతిరత్నం.. యంగ్ హీరోకు జోడీగా ఫారియా అబ్దుల్లా..

Chiranjeevi Oxygen Bank: విజయవంతంగా కొనసాగుతున్న చిరంజీవి ఆక్సిజన్ సిలిండ‌ర్ల‌ పంపిణి… సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్