Sreeleela: అయ్య బాబోయ్.. అప్పట్లో శ్రీలీల ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..? టిక్ టాక్ వీడియో వైరల్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో డ్యాన్సింగ్ క్వీన్‍గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారి.. ఇటీవలే కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ అదరగొట్టేసింది.
డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. ఈ చిత్రంలో రోషన్ జోడిగా నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో రవితేజ, శ్రీలీల మాస్ ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులు చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమోగింది. ఒక్కసారిగా ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఏకంగా అరడజనుకు పైగా చిత్రాలను ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సోషల్ మీడియాలో శ్రీలీల గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు ప్లాపులు పడినా శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత కూడా ఈ బ్యూటీకి అవకాశాలు భారీగానే వచ్చాయి.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న పుష్ప 2లో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ అదరగొట్టేసింది. ఇందులో బన్నీ, శ్రీలీల డాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అటు చేతినిండా సినిమాలు, మరోవైపు స్టడీతో బిజీగా ఉన్న శ్రీలీల… ఇటు కిస్సిక్ సాంగ్ తో మరోసారి కుర్రకారును ఊర్రుతలూగించింది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. టిక్ టాక్ రోజుల్లో చేసిన వీడియో అన్నట్లు తెలుస్తోంది.
అందులో చీర కట్టుకుని చాలా క్యూట్ గా శ్రీలీల చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు ఆరు, ఏడు సంవత్సరాల క్రితం ఈ వీడియో చేసినట్లుగా తెలుస్తోంది. చీరకట్టుకుని భలే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ క్యూట్ గా యాక్ట్ చేసింది. శ్రీలీల టాలెంట్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో శ్రీలీల భలే క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Enti apudu ila tiktok vedios chuskunta undedhi ha 🤣😂#Sreeleela pic.twitter.com/xZsV8UcuuO
— Gajala washington Bc (@lolaakul) December 16, 2024
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‍గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.