AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ఆ స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల రొమాన్స్.. బాలీవుడ్‏లో ఛాన్స్ కొట్టేసిన ధమాకా బ్యూటీ..

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న శ్రీలీల ఖాతాలో కొన్ని డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో సినిమాల ఎంపికపై కాస్త దృష్టి పెట్టింది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Sreeleela: ఆ స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల రొమాన్స్.. బాలీవుడ్‏లో ఛాన్స్ కొట్టేసిన ధమాకా బ్యూటీ..
Sreeleela
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2024 | 4:19 PM

Share

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒకే ఏడాది దాదాపు అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. కంటెంట్‏తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెండితెరపై సందడి చేసిన ఈ బ్యూటీకి కొన్ని చిత్రాలు షాకిచ్చాయి. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న శ్రీలీల ఖాతాలో కొన్ని డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో సినిమాల ఎంపికపై కాస్త దృష్టి పెట్టింది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అదెంటంటే.. ఇన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తుందట. హిందీలో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ కానున్నాడు. మొదటి నుంచి డైరెక్షన్ పై ఫోకస్ చేసిన ఇబ్రహీం.. ఇప్పుడు హీరోగా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యాడట. కరణ్ జోహార్ తెరకెక్కించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఇబ్రహీం హీరోగా అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం సర్జమీన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషించగా..ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఇబ్రహీం నటించే రెండో సినిమా దిలేర్ లో శ్రీలీల కథానాయికగా నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి శ్రీలీలను కాంటాక్ట్ కాగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రానికి కునాల్ దేశ్ ముక్ దర్శకత్వం వహించనున్నారు. అందమైన ప్రేమకథగా రాబోతున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకనట రానుంది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్