AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకం.. ఎవరో తెలుసా..?

కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ఓ వ్యక్తి రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సుపరిచితం. అలాగే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 50 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?

Tollywood: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకం.. ఎవరో తెలుసా..?
Tollywood
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2024 | 3:47 PM

Share

సోషల్ మీడియాలో వైరలయ్యే సెలబ్రెటీల త్రోబ్యాక్ ఫోటోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు చాలా మంది నటీనటుల రేర్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య ఈ త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతుంది. ఎందుకంటే తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున దగ్గర్నుంచి రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా ప్రతి ఒక్క సెలబ్రెటీ చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ఓ వ్యక్తి రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సుపరిచితం. అలాగే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 50 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..? అతడు మరెవరో కాదు.. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు.

1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బరావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీ రావు. అసలు పేరు రామయ్య. బడిలో మాస్టర్ కు తన పేరును రామోజీరావు అని చెప్పి తన పేరును తనే మార్చుకున్నారు. 1974 ఆగస్ట్ 10న విశాఖపట్నంలోని సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగేళ్లలోనే పాఠకులకు దగ్గరైంది. ఈనాడుతోపాటు సితార సినీ పత్రిక కూడా మైలురాయిగా నిలిచింది. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ వంటి అద్భుతాన్ని సృష్టించారు.

పత్రికా రంగంలో చరిత్ర సృష్టించిన రామోజీ రావు.. 1995లో ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. అలాగే బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేశారు. సినీ రంగంలో, వ్యాపారవేత్తగా రాణించిన రామోజీ రావు.. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. రామోజీ రావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.