Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: నా ఫీలింగ్స్‏కు అసలు విలువే లేదు కదా.. ఎందుకంటే.. రేణు దేశాయ్ ఆవేదన..

గత రెండు మూడు రోజులుగా తన కుమారుడు అకీరా నందన్ విషయంలో రేణూ దేశాయ్ చాలా సంతోషంగా ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లిన అకీరాను వెంట తీసుకెళ్తున్నారు పవర్ స్టార్. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి అకీరాను పరిచయం చేసిన అనంతరం కుమారు అకీరాతోపాటు భార్య అన్న లెజేనోవాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు పవన్. ఈ క్రమంలో అకీరా భుజం పై చెయ్యి వేసి పవన్ తో మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సంబరపడిపోయారు రేణూ దేశాయ్.

Renu Desai: నా ఫీలింగ్స్‏కు అసలు విలువే లేదు కదా.. ఎందుకంటే.. రేణు దేశాయ్ ఆవేదన..
Renu Desai, Akira
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2024 | 3:08 PM

Share

సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ చాలా యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం అకిరా, ఆద్య గురించి ఏదోక పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే జంతువుల సంరక్షణ గురించి వివిధ రకాల పోస్టులు చేస్తుంటారు. కానీ రేణూ దేశాయ్ చేసిన ప్రతి పోస్ట్ పై ఎవరో ఒకరు ఏదోక నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు. అయితే వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటారు రేణూ దేశాయ్. కానీ కొన్ని సందర్భాల్లో తన పోస్టులపై వచ్చే కామెంట్స్ చూసి బాధపడుతుంటారు. అందుకే కొన్ని పోస్టులకు కామెంట్ సెక్షన్ క్లోజ్ చేస్తుంటారు. ఇటీవల గత రెండు మూడు రోజులుగా తన కుమారుడు అకీరా నందన్ విషయంలో రేణూ దేశాయ్ చాలా సంతోషంగా ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లిన అకీరాను వెంట తీసుకెళ్తున్నారు పవర్ స్టార్. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి అకీరాను పరిచయం చేసిన అనంతరం కుమారు అకీరాతోపాటు భార్య అన్న లెజేనోవాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు పవన్. ఈ క్రమంలో అకీరా భుజం పై చెయ్యి వేసి పవన్ తో మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సంబరపడిపోయారు రేణూ దేశాయ్.

మొదటి నుంచి బీజేపీ వ్యక్తిగా ఉన్న తనకు ఇలా తన కుమారుడు ప్రధానిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ వరుస పోస్టులు చేశారు. అయితే ఆమె చేసిన ప్రతి పోస్టును నిశితంగా గమనించిన నెటిజన్స్.. అందులో అన్నా లెజినోవా ఉన్న వరకు కట్ చేసి పవన్, అకీరా, మోదీ ఉన్న ఫోటోస్ మాత్రమే ఎడిట్ చేశారంటూ.. పలు రకాలుగా కామెంట్స్ చేశారు. కామెంట్ సెక్షన్ డిసబుల్ చేసినా పర్సనల్ మెసేజ్ లు చేశారు. దీంతో తనకు వస్తున్న కామెంట్స్ పై రేణూ దేశాయ్ స్పందించారు. నా బాధ వాళ్లకు నవ్వులాటగా మారింది.. తన ఫీలింగ్స్ కు ఎలాంటి విలువ లేదని.. ఎందుకంటే తాను రోబో అంటూ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో కామెంట్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు. తనకు జరిగినట్లు.. వాళ్లకు కూడా జరిగితే ఆ బాధ అర్థం అవుతుందంటూ కామెంట్ చేశారు. ఇలా నెగిటివిటీని ప్రచారం చేస్తారనే కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసినా.. నా మీద మీమ్స్ చేసి కామెడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Renu Desai

Renu Desai

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.