Akira Nandan: మోదీతో అకీరా.. రేణూదేశాయ్ ఎమోషనల్ పోస్ట్.! వీడియో..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి పవన్ తనయుడు అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్. ఇటీవలే పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. పవన్ వెంట ఆయన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకీరా మోదీని కలిసారు. దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి పవన్ తనయుడు అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్. ఇటీవలే పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. పవన్ వెంట ఆయన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకీరా మోదీని కలిసారు. దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనకు మొదటి నుంచి బీజేపీ అంటే చాలా అభిమానమనీ, మోదీ పక్కన తన కుమారుడిని చూస్తుంటే చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా ఉందని, దానిని మాటల్లో వర్ణించలేనంటూ పోస్ట్ చేశారు. మోదీ గారిని కలిశాక అకీరా తనకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడని రాసుకొచ్చారు. మోదీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అని, తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. తన కుమారుడు అకీరాను సైతం ఢిల్లీకి తీసుకెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు పవన్. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటినే ఇన్‌స్టాలో రేణూ దేశాయ్ పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.