కొనసాగుతున్న వజ్రాల వేట.. పేదలను వరిస్తున్న వజ్రాలు
రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, అనంతపురం రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అనుకున్నట్టుగానే వారి ఆశలు నెరవేరుతున్నాయి. విలువైన వజ్రాలు వారికి దొరుకుతున్నాయి.
రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, అనంతపురం రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అనుకున్నట్టుగానే వారి ఆశలు నెరవేరుతున్నాయి. విలువైన వజ్రాలు వారికి దొరుకుతున్నాయి. ఇటీవల వరసగా మూడు రోజుల్లో నాలుగు వజ్రాలు లభించగా వజ్రాలు దొరికినవారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. దీంతో వజ్రాల వేట మరింత ఊపందుకుంది. తాజాగా మరో వ్యక్తికి విలువైన వజ్రం దొరికింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని పత్తికొండకు చెందిన వ్యక్తికి విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని 2 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos