ఎస్పీబీ ఆస్పత్రి బిల్లులపై తప్పుడు ప్రచారం, చరణ్ ఆవేదన
గాన గందర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లుల గురించి కొందరు చేస్తోన్న తప్పుడు ప్రచారంపై ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గాన గందర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లుల గురించి కొందరు చేస్తోన్న తప్పుడు ప్రచారంపై ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలు గారు లేరన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామన్న చరణ్, ఇది మాట్లాడాల్సిన సమయం కాదు అయినా సరే చెప్పాల్సిన అవసరం వచ్చిందని పలు విషయాలు వెల్లడించారు.
“నాన్నగారి ట్రీట్మెంట్ కి సంబంధించి బిల్లుల విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 24 వరకు నాన్నగారు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సకు సంబందించి భారీగా బిల్లు వేస్తే మేము చెల్లించలేకపోయామంటూ ప్రచారం చేస్తున్నారు. ఆసుపత్రి బిల్లు విషయంలో తమిళనాడు ప్రభుత్వం స్పందించలేదని రూమర్లు క్రియేట్ చేశారు. పెండింగ్ బిల్లు కట్టలేదని, ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం నాన్నగారి పార్దివ దేహాన్ని అప్పగించలేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక దశలో బిల్లుల విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు జోక్యం చేసుకున్నారని కూడా వార్తలు సర్కులేట్ చేశారు. ఇందులో ఏదీ వాస్తవం కాదు .. అంతా తప్పుడు ప్రచారమే. అసలు ఎంత బిల్లు అయిందో ఎవరికీ తెలీకుండానే మా మీద, హాస్పిటల్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించింది. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. అపోలో యాజమాన్యం కూడా నాన్నగారి ట్రీట్మెంట్ కి కావాల్సిన వైద్య పరికరాలను ఎంజీఎం ఆసుపత్రికి పంపింది” అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
Also Read :