భర్తపై కేసు వాపస్, పూనమ్ మరో ట్విస్ట్
పెళ్లైన 12 రోజులకే భర్త వేదిస్తున్నాడంటూ పూనమ్ పాండే ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూనమ్ ఫిర్యాదుతో భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు.
పెళ్లైన 12 రోజులకే భర్త వేదిస్తున్నాడంటూ పూనమ్ పాండే ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూనమ్ ఫిర్యాదుతో భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ అంశంపై స్పందించిన పూనమ్.. తన భర్తపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. తన ముందు కూర్చొని భర్త శామ్ బాంబే ఏడుస్తున్నాడని.. దీంతో కేసు వెనక్కు తీసుకోవాలకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రతిసారి శామ్ బాంబే తనను కొట్టి మరోసారి ఇలా చేయనంటూ ఏడవడం స్టార్ట్ చేస్తాడని వివరించింది. ఏడాదిన్నర నుంచి తన లైఫ్ ఇలానే ఉందని పూనమ్ ఎమోషనల్ అయ్యింది. అంతలోనే మళ్లీ మనసు మార్చుకుంది పూనమ్.
ప్రతి వైవాహిక జీవితంలో ఎత్తు, పల్లాలు కామన్ అని వెల్లడించింది. భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ..‘‘మా మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం ఘాడంగా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం బలమైన ప్రేమలో ఉన్నాం. దాంపత్య జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవు” అని తెలిపింది. సామ్ బాంబే కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
Also Read :