ఆ మూవీ స్ఫూర్తితోనే ‘నిశ్శబ్దం’ను రాశారట

అనుష్క నటించిన థ్రిల్లర్‌ చిత్రం 'నిశ్శబ్దం'. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న

ఆ మూవీ స్ఫూర్తితోనే 'నిశ్శబ్దం'ను రాశారట
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 27, 2020 | 3:44 PM

Anushka Nishabdham movie: అనుష్క నటించిన థ్రిల్లర్‌ చిత్రం ‘నిశ్శబ్దం’. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు హేమంత్ మధుకర్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా ఈ మూవీని పుష్పక విమానం స్ఫూర్తితో రాశారట హేమంత్‌. కమల్‌హాసన్‌-సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఘన విజయాన్ని సాధించగా.. ఆ స్ఫూర్తితోనే నిశ్శబ్దంను రాసుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన కోన వెంకట్‌కి చెప్పగా.. ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారట.

అంతేకాదు ఈ మూవీ కోసం ముందుగా తాప్సీని అనుకున్నారట. ఆమెకు పలు సందర్భాల్లో కథను కూడా చెప్పారట దర్శకుడు. అయితే ఈ లోపు కోన వెంకట్ ఈ కథను అనుష్కను చెప్పేయడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగాయని ఆయన తెలిపారు. ఇక మొదట తక్కువ బడ్జెట్‌తో ఈ మూవీని తీయాలనుకున్నామని.. కానీ ఎవరూ ఊహించని విధంగా హాలీవుడ్ నటుడు కూడా ఇందులో భాగం అయ్యారని హేమంత్ చెప్పుకొచ్చారు.

Read More:

నల్గొండ ఎగ్జామ్‌ సెంటర్‌లో నటి హేమ.. ఏ పరీక్ష‌ రాశారంటే

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం