బాలుకి దేవీశ్రీ అభ్యర్థన.!

ఇక సెలవంటూ నిన్న పుడమితల్లిలో ఐక్యమైపోయిన ఎస్పీబీని ఇంకా జనం స్మరించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ రంగంలోని సంగీతవిభాగానికి చెందిన ప్రముఖులకు ఆయన ఇక లేరన్న వార్త మింగుడుపడ్డంలేదు. మా జీవితాల్లో ఎస్పీ సర్ లేని మొదటి రోజు ఇది.. ఆయన భౌతికంగా మా మధ్య లేకున్నా మా జీవితాంతం ఆయన తన మేజికల్ వాయిస్ తో ఎప్పుడూ తమ మధ్యే ఉంటారంటూ ఒక వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ప్రముఖ సంగీత […]

బాలుకి దేవీశ్రీ అభ్యర్థన.!
Follow us
Venkata Narayana

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 4:22 PM

ఇక సెలవంటూ నిన్న పుడమితల్లిలో ఐక్యమైపోయిన ఎస్పీబీని ఇంకా జనం స్మరించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ రంగంలోని సంగీతవిభాగానికి చెందిన ప్రముఖులకు ఆయన ఇక లేరన్న వార్త మింగుడుపడ్డంలేదు. మా జీవితాల్లో ఎస్పీ సర్ లేని మొదటి రోజు ఇది.. ఆయన భౌతికంగా మా మధ్య లేకున్నా మా జీవితాంతం ఆయన తన మేజికల్ వాయిస్ తో ఎప్పుడూ తమ మధ్యే ఉంటారంటూ ఒక వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. స్వర్గలోకాన్ని వినోదభరితంగా ఉంచుతూనే మాకు మీ ఆశీర్వాదాలు అందించండి బాలు సర్.. అంటూ వేడుకున్నాడు దేవీ శ్రీ ప్రసాద్.