ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అప్పట్లో తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత.!

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ల ఫోటోలు...

ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అప్పట్లో తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత.!
Childhood Pic
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2021 | 6:07 PM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను.. వారి బర్త్‌డేల నాడు ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తుంటారు. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అందాల నాటి ఫోటోను అభిమానులు వరుసపెట్టి షేర్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోలో ముద్దులొలికే ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.! ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకోవడమే కాదు.. లేడీ సూపర్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా సహాజ నటిగా తెలుగునాట తన స్టార్‌డమ్‌ను పెంచుకోవడమే కాకుండా.. ఎంతోమంది అభిమానుల మనసులు గెలుచుకుంది. ఆమె ఎవరో కాదు సౌందర్య.

హీరోయిన్ సౌందర్య.. తెలుగుతో పాటు కన్నడం, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. 12 సంవత్సరాల ఆమె సినీ కెరీర్‌లో సుమారు 100 సినిమాల్లో నటించడమే కాకుండా.. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా నిలిచింది. అయితే అనూహ్యంగా చిన్న వయస్సులోనే ఏప్రిల్ 17, 2004లో సౌందర్య ప్రాణాలు విడిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సౌందర్య.. ‘మోడరన్ తెలుగు సినిమాకు సావిత్రి’గా పేరుగాంచింది. సౌందర్య చనిపోయే 17 ఏళ్లు గడుస్తున్నా.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం అలాగే ఉంది. ఇప్పటికీ ఆమెను అభిమానిస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు.

Soundarya