Suriya: నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్యూ.. మీ నమ్మకం, భరోసాకు కృతజ్ఞుడిని.. సూర్య ఆసక్తికర పోస్ట్..

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్

Suriya: నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్యూ.. మీ నమ్మకం, భరోసాకు కృతజ్ఞుడిని.. సూర్య ఆసక్తికర పోస్ట్..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2021 | 6:16 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. అదే సమయంలో మరోవైపు ఈ మూవీతో తమిళనాడులో వివాదం నెలకొంది. ఈ సినిమపై వన్నియర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. హీరో సూర్య పై వన్నియర్ వర్గాల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా.. సూర్యను కొట్టినవారికి లక్ష రూపాయాలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇక మరోవైపు జైభీమ్ సినిమాకు ప్రశంసలు మాత్రం తగ్గడం లేదు. ఇందులో సూర్య నటనకు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిదా అయ్యారు. అలాగే జైభీమ్ సినిమా పై నెలకొన్న వివాదానికి సూర్యకు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సూర్య తనకు లభిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆసక్తిక పోస్ట్ చేశారు.

సూర్య తన ట్వీట్టర్ ఖాతాలో జైభీమ్ మూవీని ఆదరిస్తున్న తీరు, ప్రేమ అపారమైనది.. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రేమ చూడలేదు. మీరందరు మాకు అందించిన విశ్వాసం & భరోసా పై నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేను. మాకు అండగా నిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని తెలియజేశారు. ఇక జైభీమ్ సినిమా నెలకొన్ని వివాదానికి సోషల్ మీడియాలో సూర్యకు మద్దతు లభిస్తుంది. స్టాండ్ విత్ సూర్య అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పలు అంశాలు ఓవర్గం వారిని కించపరిచేలా ఉన్నాయని పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. హీరోతోపాటు.. చిత్రయూనిట్ పై చర్యలు తీసుకోవాలని పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. అయితే తనపై.. సినిమా వస్తున్న ఆరోపణలను హీరో సూర్య ఖండించారు. ఇప్పటికే సూర్య వామపక్షాలకు లేఖ రాశాడు. నిజఘటనలో బాధితురాలుగా ఉన్న పార్వతి అమ్మాన్ పేరు మీద రూ. 10 లక్షలు బ్యాంకు లో వేసినట్టు చెప్పారు. అంతేకాదు దళితులకు ఎన్నో సందర్భాలలో బాసట గా నిలిచిన వామపక్షాల నేతలంటే తనకెంతో గౌరవమని , వారి సిద్ధాంతాలను ఎప్పటికి గౌరవిస్తానని సూర్య లేఖలో పేర్కొన్నాడు.

ట్వీట్..

Also Read: Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..

Agent: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఏజెంట్..