Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Soda Center: సోడాల శ్రీదేవి ఇంట్రో టీజర్.. ఈ అమ్మడు మామూలుది కాదు బాబోయ్..

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. మహేష్ బావ మరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన..

Sridevi Soda Center: సోడాల శ్రీదేవి ఇంట్రో టీజర్.. ఈ అమ్మడు మామూలుది కాదు బాబోయ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2021 | 12:42 PM

Sridevi Soda Center: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నడు హీరో సుధీర్ బాబు. మహేష్ బాబు బావ మరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన ప్రతిభతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు సుధీర్ బాబు. ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్ బాబు ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చివరిగా నానితో కలిసి ‘వి’ అనే సినిమాలో నటించాడు సుధీర్ బాబు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. వాటిలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా ఒకటి మరొకటి ‘శ్రీదేవి సోడా సెంటర్’. వీటిలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ముందుగా విడుదల కానుంది. పలాస సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఇంట్రో వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో సోడా శ్రీదేవిగా ఆనంది నటించింది. ‘ఈ రోజుల్లో’ ‘బస్ స్టాప్’వంటి సినిమాలతో అలరించిన ఆనంది ఆ తర్వాత తమిళనాట మంచి గుర్తిపు తెచ్చుకుంది. ఇక తాజాగా విడుదల చేసిన వీడియోలో లైటింగ్ సూరిబాబు శ్రీదేవికి సైట్ కొట్టడాన్ని చూపించారు. సుధీర్ బాబు సోడా తాగుతుంటే ‘గోలీ గొంతులోకి దిగుద్ది జాగ్రత్త’ అనీ… ఆతర్వాత ‘నీలాగే ఒకడు సోడా సోడా అని తిరిగితే సోడా తీసి వాడి నెత్తి మీద కొట్టా.. అప్పటి నుంచి అందరూ నన్ను సోడాల శ్రీదేవి అంటున్నారు’అంటూ సుధీర్ బాబుకు వార్నింగ్ ఇవ్వడం ఈ వీడియోలో చూపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mimi Movie Review: మిమి.. భావోద్వేగ మిళితం.. మాతృత్వాన్ని మొక్కుతాం..

Netrikann Trailer: క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌గా రానున్న ‘నెట్రికన్’.. ఆకట్టుకొంటున్న నయనతార మూవీ ట్రైలర్..

Pooja Hegde: పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌‌‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ