Sobhita Dhulipala: తెల్ల చీరలో బొండు మల్లెలా మెరిసిన ముద్దుగుమ్మ.. శోభితను ఇలా చూస్తే కుర్రకారు ప్రేమలోపడకుండా ఉండగలరా..
రీసెంట్‌గా ది నైట్ మేనేజర్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చిన శోభిత డిజిటల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశారు. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. నటనతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది

మిస్ ఇండియా టైటిల్ గెలిచిన శోభితా దూళిపాల.. సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో సినిమాలు చేస్తున్నా అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే రాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా ది నైట్ మేనేజర్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చిన శోభిత డిజిటల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశారు. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. నటనతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. తెలుగులో గూఢచారి సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.
గ్లామర్ ఫీల్డ్‌లో ఫుల్ బిజీగానే ఉన్నా.. వెండితెర మీద మాత్రం ఆ రేంజ్‌లో జోరు చూపించలేకపోతున్నారు శోభితా. వరుసగా అవకాశాలు వస్తున్నా.. హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ మాత్రం దక్కటం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రాకపోవటం.. చేసిన రోల్స్ కూడా గెస్ట్ రోల్స్ లా కాసేపు తెర మీద కనిపించేవే కావటంతో.. అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు రావటం లేదు.
ఇక ఈ చిన్నది అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల విందు ఆకట్టుకుంది. చీరకట్టులో అదరగొట్టింది ఈ చిన్నది. మోడ్రన్ డ్రస్సులోనే కాదు.. చీరలనూపరువాల వల వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram




