AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: నువ్వు దేవుడివి సామీ.. అభిమాని ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్‌.. ఎమోషనల్‌ వీడియో చూశారా?

సినిమాల సంగతి పక్కన పెడితే ప్రభాస్‌ మనసు కూడా చాలా విశాలమైనది. సాయం అడిగిన వారికి కాదనలేకుండా హెల్ప్‌ చేస్తాడు. ఇక అతిథి మర్యాదలు చేయడంలో ఆయన నిజంగా రాజే. సినిమా షూటింగ్‌ ఉంటే యూనిట్‌ సభ్యులందరికీ ఇంటి నుంచి విందు భోజనాలు తెప్పిస్తుంటాడు. అందుకే అభిమానులందరూ ప్రభాస్‌ను డార్లింగ్ అని ముద్దుపేరుతో పిల్చుకుంటారు.

Prabhas: నువ్వు దేవుడివి సామీ.. అభిమాని ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్‌.. ఎమోషనల్‌ వీడియో చూశారా?
Prabhas
Basha Shek
|

Updated on: May 28, 2023 | 8:24 AM

Share

ప్రభాస్‌.. ప్రస్తుతం పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌ డమ్‌ అనుభవిస్తోన్న టాలీవుడ్‌ హీరో. అతని గత సినిమాలు కొంచెం నిరాశపర్చినా అభిమానం కూసింత కూడా తగ్గలేదు. పైగా రెట్టింపయ్యింది. సినిమాల సంగతి పక్కన పెడితే ప్రభాస్‌ మనసు కూడా చాలా విశాలమైనది. సాయం అడిగిన వారికి కాదనలేకుండా హెల్ప్‌ చేస్తాడు. ఇక అతిథి మర్యాదలు చేయడంలో ఆయన నిజంగా రాజే. సినిమా షూటింగ్‌ ఉంటే యూనిట్‌ సభ్యులందరికీ ఇంటి నుంచి విందు భోజనాలు తెప్పిస్తుంటాడు. అందుకే అభిమానులందరూ ప్రభాస్‌ను డార్లింగ్ అని ముద్దుపేరుతో పిల్చుకుంటారు. ఇక ప్రభాస్‌ కూడా అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఫ్యాన్స్‌ను కలిసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అభిమాని కోసం ప్రభాస్‌ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘నువ్వు దేవుడివి స్వామి’ అంటూ ప్రభాస్ పై ప్రశంసల  వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం రండి.

ఇందులో ప్రభాస్‌తో ఉన్న అభిమాని కేరు కన్నయ్య అలియాస్‌ రంజిత్‌. ప్రస్తుతం అతను మన మధ్య లేడు. క్యాన్సర్‌ కారణంగా కొన్నేళ్ల క్రితమే కన్నుమూశాడు. కాగా రంజిత్‌ కన్నుమూసే ముందు అతని ఆఖరి కోరికలు తీర్చాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. కుమారుడిని ఇష్టమైన ప్రాంతాలకు తీసుకెళ్లడం, ఇష్టమైన వంటకాలు చేసి పెట్టడం వంటివి చేశారు. అలాగే కన్నయ్యకు ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టం. అతనిని కలవాలని ఉన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. బిడ్డ ఆఖరి కోరిక తీర్చేందుకు అతని తల్లి.. డైరెక్టర్‌ పూరి సతీమణి లావణ్యకు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపిది. ఆమె ఈ విషయాన్నిప్రభాస్‌కు చేరవేయగా.. అభిమానిని కలిసేందుకు వెంటనే ఒప్పుకున్నాడు. అతనికి ఇష్టమైన వంటకంతో పాటు అతని కోరికగా అడగ్గా.. బాహుబలి సినిమాలో వినియోగించిన ఏదైనా వస్తువు కానుకగా ఇవ్వాలని కన్నయ్య అడిగాడు. అలా అడిగిన వెంటనే అన్ని ఏర్పాట్లు చేశారట ప్రభాస్‌. కన్నయ్య, అతని తల్లిని కలిసిన ప్రభాస్.. కన్నయ్యకు ఇష్టమైన చికెన్ మంచూరియా తెప్పించి ఇచ్చారట. అలాగే బహుబలి సినిమాలో వినియోగించిన కత్తిని బహుమతిగా ఇచ్చారట. వారితో చాలాసేపు మాట్లాడారట. అలా కుమారుడి కళ్లల్లో ఆనందం చూసిన తల్లి ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఇదంతా గతేడాది జరిగింది. ఆ తర్వాత కన్నయ్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. అయితే అతనిని మర్చిపోలేని తల్లి తన ఇంట్లోనే విగ్రహం కట్టించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us