Sir Movie Review: సార్.. మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా..
ఇప్పుడు ధనుష్ సార్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. అంచనాలు అందుకుందా..?
మూవీ రివ్యూ: సార్
నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, సముద్రఖని, సుమంత్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: యువరాజ్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ, శ్రీకర స్టూడియోస్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకీ అట్లూరి
ఈమధ్య తమిళ హీరోలు, తెలుగు దర్శకుల కాంబినేషన్ పై ఆసక్తి బాగా పెరిగిపోయింది. సంక్రాంతికి వారసుడు సినిమాతో విజయ్ తెలుగులోను మంచి కలెక్షన్స్ సాధించాడు. ఇప్పుడు ధనుష్ సార్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. అంచనాలు అందుకుందా..?
కథ:
బాలగంగాధర్ తిలక్ (ధనుష్) త్రిపాఠి (సముద్రఖని) ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా సిరిపురంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు లెక్చరర్ గా వెళ్లాల్సి వస్తుంది బాలు. అదే కాలేజీలో బయాలజీ లెక్చరర్ అయిన మీనాక్షి (సంయుక్త మీనన్)ను తొలిచూపులోనే చూసి ఇష్టపడతాడు బాలు. ఇదిలా ఉంటే ఆ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. దాంతో త్రిపాఠి ఈ కాలేజ్ వల్ల తన ఎడ్యుకేషనల్ బిజినెస్ పాడవుతుందని బాలుతో పాటు ఆ ఊరి పిల్లల్ని కూడా చదువుకోనీకుండా అడ్డు పడతాడు. అదే సమయంలో త్రిపాఠితో బాలు ఒక సవాల్ చేస్తాడు.. అదేంటి ఆ ఊరి పిల్లలందరూ చదువుకొని ప్రయోజకులయ్యారా లేదా.. అసలు ఆ ఊరి కోసం సార్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ..
కథనం:
కథగా చెప్పుకుంటే సార్ సినిమా కొత్తగా ఏమి ఉండదు. కానీ చెప్పిన విధానం మాత్రం కొత్తగానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో చాలా వరకు వెంకీ అట్లూరి తన మ్యాజిక్ చూపించాడు. తెలిసిన సన్నివేశాలు అయిన వాటికి ఎమోషన్స్ జోడించి స్క్రీన్ మీద మాయ చేశాడు. ముఖ్యంగా చదువును మార్కెట్లో వ్యాపారంగా ఎలా మార్చారు అనే విషయాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించాడు వెంకీ అట్లూరి. ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలను ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రైవేట్ సెక్టార్లో పడి చదువు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా దూరమైపోతుంది అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. కథ మోస్ట్ రిలవెంట్ గా ఉన్నా కూడా.. వెంకీ అట్లూరి ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎక్కడ కమర్షియల్ హక్కులకు పోకుండా హానెస్ట్ అటెంప్ట్ చేశాడు వెంకీ. కాకపోతే మరీ ఫ్లాట్ గా ఉండడం.. మొదటి నుంచి చివరి వరకు పెద్దగా ట్విస్టులు లేకపోవడం సార్ సినిమాకు మైనస్ అవుతుంది. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం అద్భుతంగా కనెక్టయ్యాయి. ఊర్లోకి వచ్చిన వెంటనే కాలేజీకి పిల్లలు ఎవరూ రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి చదువు గొప్పతనం గురించి ధనుష్ చెప్పే సీన్ బాగుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ధనుష్ ఊరి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలందరూ ఒక్కటై ఆయన కోసం నిలబడేసిన అద్భుతంగా వచ్చింది. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా చదువుకోవాలి.. కొనకూడదు అనే లైన్ వెంకీ బాగా చెప్పాడు.
నటీనటులు:
సార్ పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. ఆయన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. సంయుక్త మీద తనకున్నంతలో బాగా నటించింది. విధంగా సముద్రఖని చేయడానికి పెద్దగా ఏం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతగా బాగా నటించాడు. హైపర్ ఆది ఉన్నంత సేపు బాగానే నవ్వించాడు. తనికెళ్ల భరణి, సాయి కుమార్ లాంటి వాళ్ళు పాత్రలకు తగినట్టు మెప్పించారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. దానికి తోడు మాస్టారు మాస్టారు సాంగ్ విజువల్ గా కూడా అద్భుతంగా ఉంది. మిగిలిన పాటలు ఓకే. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో అడ్వాంటేజ్. తన కెమెరా వర్క్ తో సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చాడు యువరాజ్. నవీన్ నులి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడిగా వెంకి అట్లూరి మంచి కథ చెప్పాలనుకున్నాడు.. హానెస్ట్ గా చెప్పాడు. మాటల రచయితగా అద్భుతమైన డైలాగులు రాశాడు.
పంచ్ లైన్:
సార్.. మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.