Amy Jackson: పెళ్లికి ముందే పిల్లాడు.. ప్రియుడితో బ్రేకప్.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హీరోయిన్ అమీ జాక్సన్..
కొంతకాలంగా ఆమె బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్విక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అమీ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. తాజాగా వీటిపై ఓపెన్ అయ్యింది అమీ జాక్సన్.
ప్రస్తుతం భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అమీ జాక్సన్ ఒకరు. డైరెక్టర్ శంకర్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన ఐ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎవడు.. రోబో 2.0 సినిమాలతో హీరోయిన్గా మెప్పించింది ఈ బ్రిటిష్ బ్యూటీ. అయితే కథానాయికగా కెరీర్ ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ సమయంలోనే పెళ్లి కాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ.. ఆ తర్వాత ప్రియుడితో విడిపోయింది. దీంతో అప్పటినుంచి ఆమె సింగిల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా ఆమె బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్విక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అమీ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. తాజాగా వీటిపై ఓపెన్ అయ్యింది అమీ జాక్సన్.
తాజాగా తన ప్రేమ గురించి బయటపెట్టింది హీరోయిన్ అమీజాక్సన్. తన కొత్త ప్రియుడిని పరిచయం చేసింది. ఎడ్వెస్ట్విక్తో ప్రేమలో ఉన్నట్టు వాలెంటైన్స్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎడ్వెస్ట్వీక్తో దిగిన పలు రొమాంటిక్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ.. నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు. అంటూ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది.
ఇక అమీ జాక్సన్ పోస్ట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు క్యూట్ కపూల్ అంటూ కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం అమీ తీరున విమర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే డేటింగ్.. బిడ్డకు జన్మనివ్వడం.. బ్రేకప్.. ఆ తర్వాత మరో ప్రియుడితో ప్రేమాయణం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమీ జాక్సన్ సినిమాలకు దూరంగా ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.