Salaar: Part 1: సలార్ సినిమాలో యశ్ కూడా ఉన్నాడా..? సింగర్ ఇచ్చిన హింట్‌తో ఫుల్ ఖుష్ లో ఫ్యాన్స్

కేజీఎఫ్‌లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమాకు, కేజీఎఫ్ 2 సినిమాకు మొదటి నుంచి లింక్ ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీనికి క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించిన ఎలాంటి క్లూ ట్రైలర్, టీజర్‌లో ఎక్కడా వెల్లడించలేదు. తాజాగా 'సలార్ ' సినిమాలో ఓ పాట పాడిన తీర్థ సుభాష్ తాజాగా ఓ క్లూ ఇచ్చింది. ఆమె ఇంటర్వ్యూపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Salaar: Part 1: సలార్ సినిమాలో యశ్ కూడా ఉన్నాడా..? సింగర్ ఇచ్చిన హింట్‌తో ఫుల్ ఖుష్ లో ఫ్యాన్స్
Yash, Salaar
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2023 | 11:49 AM

మరికొద్దిరోజుల్లో ‘సలార్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న సలార్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కేజీఎఫ్‌లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమాకు, కేజీఎఫ్ 2 సినిమాకు మొదటి నుంచి లింక్ ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీనికి క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించిన ఎలాంటి క్లూ ట్రైలర్, టీజర్‌లో ఎక్కడా వెల్లడించలేదు. తాజాగా ‘సలార్ ‘ సినిమాలో ఓ పాట పాడిన తీర్థ సుభాష్ తాజాగా ఓ క్లూ ఇచ్చింది. ఆమె ఇంటర్వ్యూపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

త్వరలోనే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ ఉంటాయి. ఇప్పుడు స్  ‘సలార్’ సినిమాలోనూ అదే జరగనుందని అంటున్నారు. తాజాగా సింగర్ , చిన్నారి తీర్థ సుభాష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తీర్ధ స్వస్థలం కేరళ. ఇటీవల సింగింగ్ రియాల్టీ షోలో విజేతగా నిలిచింది ఈ చిన్నారి. ఈ ఆనందాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘సలార్’ సినిమాలో ఓ పాట పాట పాడాను అని తెలిపింది తీర్ధ. ప్రభాస్ అంకుల్, పృథ్వీరాజ్ అంకుల్, యష్ అంకుల్ లతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపింది. ఇప్పుడు ఈ చిన్నదాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆతర్వాత తీర్థ మరో ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ  ఇచ్చింది. ‘కేజీఎఫ్ సినిమా చాలాసార్లు చూశాను. కేజీఎఫ్ టీమ్‌కి సంగీత దర్శకుడు సలార్ కూడా పనిచేశారని నాన్న చెప్పారు. అందుకే సలార్ సినిమాలో యష్ అంకుల్ కూడా ఉంటాడని నా మనసులో అనుకున్నాను. అందుకే ఆయన పేరు చెప్పను అని తెలిపింది. ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు సలార్ లో నటించారు. డిసెంబర్ 22న సినిమా విడుదలవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..