Singer Sunitha: ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు.. స్పందించిన సింగర్ సునీత.. నా లైఫ్‌కు సంబంధించినది కాదంటూ..
ఈనెల 26వ తేదీన హైదరాబాద్ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాదు ఈ కన్సర్ట్‌లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.
ప్రముఖ సింగర్ సునీత గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె త్వరలో తల్లి కాబోతుందన్న రూమర్లు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతున్నాయి. అయితే ఆమెపై ఇలా పుకార్లు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోన్న సునీత తాజా రూమర్లపై స్పందించింది. ‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు’ అని తనపై వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు స్టార్ సింగర్. కాగా ఈనెల 26వ తేదీన హైదరాబాద్ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాదు ఈ కన్సర్ట్‌లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.
‘ఇళయరాజా కన్సర్ట్ సంథింగ్ వెరీ స్పెషల్. కొత్తగా అని చెప్పను కానీ.. నాకెంతో స్పెషల్. ఒక సింగర్‌గా నేను ఈ కన్సర్ట్‌లో పాడబోతున్నందుకే కాకుండా.. ఇళయరాజా గారి వీరాభిమానిగా ఇది నాకు చాలా స్పెషల్’ అని చెప్పుకొచ్చారు సునీత. కాగా సునీత తనయుడు ఆకాశ్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే సింగర్‌గా కాదు.. హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ‘సర్కారు నౌకరి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్‌కే టెలీషో బ్యానర్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..