SP Sailaja: సినిమాలో ఆ హీరోను కాలితో తన్నాల్సి వచ్చింది.. ఎస్పీ శైలజ ఆసక్తికర కామెంట్స్..

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్న శైలజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్... ఫ్యామిలీ.. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇంత పెద్ద సింగర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని.. అమ్మ ప్రోత్సాహంతో మొదటిసారి మార్పు సినిమాలో ఒక పాట పాడినట్లు చెప్పారు.

SP Sailaja: సినిమాలో ఆ హీరోను కాలితో తన్నాల్సి వచ్చింది.. ఎస్పీ శైలజ ఆసక్తికర కామెంట్స్..
Sp Shailaja
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2023 | 3:58 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు గాయని ఎస్పీ శైలజ. గాయనిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగున్నర దశబ్దాలకు పైగా తన అద్బుతమైన గాత్రంతో శ్రోతల మనసులు దొచుకుంది. దక్షిణాదిలో దాదాపు 7వేల పాటలకు పైగా ఆలపించారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం చెల్లెల్లుగా ఇండస్ట్రీలో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్న శైలజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్… ఫ్యామిలీ.. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇంత పెద్ద సింగర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని.. అమ్మ ప్రోత్సాహంతో మొదటిసారి మార్పు సినిమాలో ఒక పాట పాడినట్లు చెప్పారు.

చిన్న వయసులో తాను భారత నాట్యంలోకి అరంగేట్రం చేసినప్పుడు తీసిన ఫోటోలను డైరెక్టర్ కె. విశ్వనాద్ చూసి సాగర సంగమం సినిమాలో అవకాశమిచ్చారని అన్నారు. కానీ ఆ సినిమా చేసేందుకు తాను అంగీకరించలేదని.. ఇంట్లో వాళ్లందరు చెప్పిన ఒప్పుకోలేదని.. చివరకు తన తండ్రి చెపితే అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు.

ఎస్పీ శైలజ మాట్లాడుతూ”డైరెక్టర్ విశ్వనాధ్ గారు దర్శకుడిగా కంటే కూడా ఓ అన్నయ్యగా నాకు అనుబంధం ఎక్కువ. చాలా విషయాలను పంచుకునేవారు. సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారిని కాలుతో కొట్టే సన్నివేశం ఉంది. దానికి నేను ఎన్నిసార్లు ప్రయత్నించిన నా కాలు వెనక్కు వచ్చేంది. దీంతో విశ్వనాథ్ గారు వచ్చి.. ఇవి కేవలం పాత్రలు మాత్రమే.. నిజం కాదంటూ వివరంగా చెప్పారు. ఆయన కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా ఆశ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.